హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS Tenth Supplementary Results: నేడు తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు.. ఈ లింక్ తో రిజల్ట్స్

TS Tenth Supplementary Results: నేడు తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు.. ఈ లింక్ తో రిజల్ట్స్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నేడు తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు (TS Tenth Supplementary Results) విడుదల కానున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  నేడు తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు (TS Tenth Supplementary Results) విడుదల కానున్నాయి. ఈ రోజు ఉదయం 11.30 నిమిషాలకు ఫలితాలను తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను www.bse.telangana.gov.in వెబ్ సైట్లో చెక్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు. తెలంగాణ టెన్త్ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు (Exams) ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించారు అధికారులు. మొత్తం 55,662 మంది విద్యార్థులు (Students) ఈ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరి కోసం 204 కేంద్రాలను ఏర్పాటు చేసింది తెలంగాణ విద్యాశాఖ.

  ఇదిలా ఉంటే.. తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్ కు సంబంధించిన ఫలితాలను (TS Tenth Results) తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జూన్ 30న విడుదల చేశారు. ఈ ఫలితాల్లో (Results) ఏకంగా 90 శాతం ఉత్తీర్ణత శాతం నమోదవడం విశేషం. కరోనా నేపథ్యంలో ఈ సారి పాస్ పర్సంటేజ్ భారీగా పడిపోతుందన్న అనుమానాలను తెలంగాణ విద్యార్థులు తలక్రిందులు చేశారు. భారీగా ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర చరిత్రలోనే సంచలన రికార్డు నమోదు చేశారు. ఈ సారి ఏకంగా 90 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ సారి మొత్తం 5,04,398 మంది అభ్యర్థులు ఈ సారి టెన్త్ పరీక్షలకు హాజరయ్యారు.

  Garment Industry: కెరీర్ పరంగా కొత్తగా దూసుకువెళ్లాలనుకుంటున్నారా..? అయితే, ఈ ఆప్షన్ మీ కోసమే..

  ఇందులో 5,04,579 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా.. ప్రైవేటు అభ్యర్థులు 819 మంది ఉన్నారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థుల్లో 90 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. బాలికల్లో 92.45 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. బాలురు 87.61 శాత ఉత్తీర్ణత నమోదైంది. ప్రైవేటుగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో కేవలం 51.89 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారు.

  ఫలితాల్లో దాదాపు 3007 స్కూళ్లు 100 శాతం ఫలితాలు సాధించాయి. అయితే 15 స్కూళ్లలో సున్నా శాతం ఫలితాలు నమోదయ్యాయి. సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. అక్కడ పాస్ పర్సంటేజ్ 97.85 శాతం. అయితే రాజధాని ప్రాంతం అయిన హైదరాబాద్ జిల్లాలో అత్యల్ప ఉత్తీర్ణత శాతం నమోదైంది. కేవలం 79.63 శాతం విద్యార్థులు మాత్రమే పాస్ అయ్యారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Exams, JOBS, SSC results

  ఉత్తమ కథలు