TS SSC Supplementary 2019 : జూన్ 10 నుంచి టెన్త్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్..

TS SSC Supplementary 2019 | జూన్ 10 నుంచి 24 వరకు  పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు పరీక్షల ఫీజు చెల్లించేందుకు మే 27న చివరితేదీగా నిర్ణయించారు. సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌కి అప్లై చేసుకోవాలనుకునే విద్యార్థులు మే 27 లోగా ఫీజు చెల్లించాలని అధికారులు తెలిపారు.

news18-telugu
Updated: May 13, 2019, 12:24 PM IST
TS SSC Supplementary 2019 : జూన్ 10 నుంచి టెన్త్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 92.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ నేపథ్యంలో జూన్ 10 నుంచి 24 వరకు  పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు పరీక్షల ఫీజు చెల్లించేందుకు మే 27న చివరితేదీగా నిర్ణయించారు. సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌కి అప్లై చేసుకోవాలనుకునే విద్యార్థులు మే 27 లోగా ఫీజు చెల్లించాలని అధికారులు తెలిపారు.

తాజాగా విడుదలైన పదోతరగతి ఫలితాల్లో జగిత్యాల జిల్లా మొదటిస్థానంలో నిలవగా.. చివరిస్థానంలో హైదరాబాద్ ఉంది. ఎప్పట్లానే ఈ సారి కూడా ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. తెలుగు మీడియంతో పోలిస్తే ఇంగ్లీష్ మీడియంలోనే ఉత్తీర్ణత శాతం పెరిగింది. 1580 జెడ్పీ హైస్కూళ్లలో వందశాతం ఉత్తీర్ణత సాధించారు.

ఇవి కూడా చదవండి..

Indian Navy Jobs : టెన్త్ చదివితే చాలు.. ఇండియన్ నేవీలో జాబ్స్.. జీతం.. రూ.50 వేలు



Govt Jobs : పదోతరగతి అర్హతతోనే బోర్డర్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలు

AP SSC Results 2019 : రేపే ఏపీ పదో తరగతి ఫలితాలు..
First published: May 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...