TS SSC RESULTS 2022 HERE IS THE IMPORTANT DETAILS ABOUT RECOUNTING NS
TS Tenth Results Recounting Details: తెలంగాణ టెన్త్ రిజల్ట్స్.. రీ కౌంటింగ్ కావాలంటే ఇలా చేయండి
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణ టెన్త్ ఫలితాలు (TS Tenth Results) ఈ రోజు విడుదలయ్యాయి. అయితే.. మార్కులు తక్కువ వచ్చి రీ కౌంటింగ్ చేయించుకోవాలనుకుంటున్న విద్యార్థులు ఈ కింది విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.
తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్ కు సంబంధించిన ఫలితాలను (TS Tenth Results) తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొద్ది సేపటి క్రితం విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఫలితాల్లో (Results) ఏకంగా 90 శాతం ఉత్తీర్ణత శాతం నమోదవడం విశేషం. అయితే.. ఫెయిలయిన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు సప్లమెంటరీ ఎగ్జామ్స్ (Exams) ను నిర్వహించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఎవరైనా రీ కౌంటింగ్ చేయించుకోవాలనుకుంటే.. సబ్జెక్టుకు రూ.500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ డబ్బులను ఫలితాలు విడుదలైన పది రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు రీకౌంటింగ్ కోసం Office Of the Director Of Government Examinations, Telangana, Hyderabad కార్యాలయంలో రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్సర్ షీట్ కు సంబంధిచిన రీ వెరిఫికేషన్ కోసం విద్యార్థులు హాల్ టికెట్ జిరాక్స్ కాపీతో పాటు రీ వెరిఫికేషన్ అప్లికేషన్ ను పంపించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇందుకు సంబంధించిన అప్లికేషన్ ఫార్మాట్ ను www.bse.telangana.gov.in వెబ్ సైట్ల్ నుంచి తెలుసుకోవచ్చు. అభ్యర్థులు సబ్జెక్టుకు రూ.1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే.. కరోనా నేపథ్యంలో ఈ సారి పాస్ పర్సంటేజ్ భారీగా పడిపోతుందన్న అనుమానాలను తెలంగాణ విద్యార్థులు తలక్రిందులు చేశారు. భారీగా ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర చరిత్రలోనే సంచలన రికార్డు నమోదు చేశారు. ఈ సారి ఏకంగా 90 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ సారి మొత్తం 5,04,398 మంది అభ్యర్థులు ఈ సారి టెన్త్ పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 5,04,579 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా.. ప్రైవేటు అభ్యర్థులు 819 మంది ఉన్నారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థుల్లో 90 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. TS 10th Results Direct Link: తెలంగాణ టెన్త్ ఫలితాలు వచ్చేశాయ్.. 10 సెకండ్లలో మీ రిజల్ట్ తెలుసుకోండిలా
బాలికల్లో 92.45 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. బాలురు 87.61 శాత ఉత్తీర్ణత నమోదైంది. ప్రైవేటుగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో కేవలం 51.89 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారు. ఫలితాల్లో దాదాపు 3007 స్కూళ్లు 100 శాతం ఫలితాలు సాధించాయి. అయితే 15 స్కూళ్లలో సున్నా శాతం ఫలితాలు నమోదయ్యాయి. సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. అక్కడ పాస్ పర్సంటేజ్ 97.85 శాతం. అయితే రాజధాని ప్రాంతం అయిన హైదరాబాద్ జిల్లాలో అత్యల్ప ఉత్తీర్ణత శాతం నమోదైంది. కేవలం 79.63 శాతం విద్యార్థులు మాత్రమే పాస్ అయ్యారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.