TS SSC RESULTS 2022 90 PERCENT STUDENTS PASSED IN TELANGANA TENTH RESULTS AND CM KCR OWN DISTRICT SIDDIPET STUDENTS CREATED NEW HISTORY NS
TS SSC Results 2022: తెలంగాణ టెన్త్ ఫలితాల్లో ఏకంగా 90 శాతం ఉత్తీర్ణత.. సీఎం సొంత జిల్లా సంచలన రికార్డు.. వివరాలివే
ప్రతీకాత్మక చిత్రం
తాజాగా విడుదల చేసిన టెన్త్ ఫలితాల్లో (TS Tenth Results) భారీగా ఉత్తీర్ణత శాతం నమోదైంది. కరోనా (Corona) నేపథ్యంలో ఈ సారి పాస్ పర్సంటేజ్ భారీగా పడిపోతుందన్న అనుమానాలను తెలంగాణ విద్యార్థులు తలక్రిందులు చేశారు. భారీగా ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర చరిత్రలోనే సంచలన రికార్డు నమోదు చేశారు.
తెలంగాణ టెన్త్ ఫలితాలను (TS Tenth Results) విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొద్ది సేపటి క్రితమే విడుదల చేశారు. అయితే ఫలితాల్లో భారీగా ఉత్తీర్ణత శాతం నమోదైంది. కరోనా (Corona) నేపథ్యంలో ఈ సారి పాస్ పర్సంటేజ్ భారీగా పడిపోతుందన్న అనుమానాలను తెలంగాణవిద్యార్థులు (Telangana Students) తలక్రిందులు చేశారు. భారీగా ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర చరిత్రలోనే సంచలన రికార్డు నమోదు చేశారు. ఈ సారి ఏకంగా 90 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ సారి మొత్తం 5,04,398 మంది అభ్యర్థులు ఈ సారి టెన్త్ పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 5,04,579 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా.. ప్రైవేటు అభ్యర్థులు 819 మంది ఉన్నారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థుల్లో 90 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. బాలికల్లో 92.45 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. బాలురు 87.61 శాత ఉత్తీర్ణత నమోదైంది. ప్రైవేటుగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో కేవలం 51.89 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారు. ఫలితాల్లో దాదాపు 3007 స్కూళ్లు 100 శాతం ఫలితాలు సాధించాయి. అయితే 15 స్కూళ్లలో సున్నా శాతం ఫలితాలు నమోదయ్యాయి.
సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. అక్కడ పాస్ పర్సంటేజ్ 97.85 శాతం. అయితే రాజధాని ప్రాంతం అయిన హైదరాబాద్ జిల్లాలో అత్యల్ప ఉత్తీర్ణత శాతం నమోదైంది. కేవలం 79.63 శాతం విద్యార్థులు మాత్రమే పాస్ అయ్యారు. గురుకుల స్కూళ్లు మరో సారి పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటాయి. తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో 99.32 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ స్కూళ్లలో 75.68 శాతం ఉత్తీర్ణత నమోదైంది. TS 10th Results Direct Link: తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల.. ఇక్కడ క్లిక్ చేస్తే 10 సెకన్లలో రిజల్ట్
తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్ కు సంబంధించిన ఫలితాలు (TS Tenth Results) విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Reddy) ఈ రోజు ఉదయం 11.30 గంటలకు విడుదల చేశారు. విద్యార్థులు bse.telangana.gov.in, bseresults.telangana.gov.in తదితర వెబ్‌సైట్ల ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. విద్యార్థుల కోసం న్యూస్18 సైతం ఫలితాలను అందించే ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను https://telugu.news18.com/ వెబ్ సైట్లోనూ సులువుగా చెక్ చేసుకోవచ్చు. ఈ సారి మొత్తం 5,04,398 మంది అభ్యర్థులు ఈ సారి టెన్త్ పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 5,04,579 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా.. ప్రైవేటు అభ్యర్థులు 819 మంది ఉన్నారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థుల్లో 90 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. బాలికల్లో 92.45 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. బాలురు 87.61 శాత ఉత్తీర్ణత నమోదైంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.