TS SSC Results : రేపే పదో తరగతి ఫలితాలు.. న్యూస్18 తెలుగు వెబ్‌సైట్‌లో..

TS SSC Results | పదో తరగతి ఫలితాల కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించారు అధికారులు. ఈ యాప్ ద్వారా ఫలితాలు విడుదల చేసిన వెంటనే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు లాగిన్ అయి రిజల్ట్స్‌ని తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే ఈ యాప్ ద్వారా పరిష్కరించుకోవచ్చని, అందుకు చాలా బాగా ఉపయోగపడుతుందని తెలిపారు అధికారులు.

news18-telugu
Updated: May 12, 2019, 6:04 PM IST
TS SSC Results : రేపే పదో తరగతి ఫలితాలు.. న్యూస్18 తెలుగు వెబ్‌సైట్‌లో..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ పదోతరగతి ఫలితాలు సోమవారం(మే 13)న విడుదల కానున్నాయి. ఫలితాల విడుదలకు తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఇంటర్ ఫలితాల్లో ఏర్పడని గందరగోళం కారణంగా మళ్లీ అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే పేపర్ వాల్యుయేషన్, ఫలితాల ప్రకటన ఇలా అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మే 13 ఉదయం 11.30 గంటలకు తెలంగాణ సచివాలయంలో పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు.

Telangana SSC Result 2019 : టెన్త్ రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..

* ముందుగా bsetelangana.org, results.cgg.gov.in వెబ్స్‌సైట్స్‌లో ఏదైనా ఓ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

* ఇప్పుడు ts ssc results అనే లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి..


* ఇప్పుడు మీ రూల్ నెంబర్, పుట్టిన తేది ఎంటర్ చేయండి.. సబ్‌మిట్ చేయండి..
* రిజల్ట్స్ ఓపెన్ అవుతాయి.
* రిజల్ట్స్‌ని ప్రింట్ కాపీ తీసుకుని దగ్గర పెట్టుకుండి.
Loading...
రిజల్ట్స్ న్యూస్ 18 తెలుగు వెబ్‌సైట్‌ పోర్టల్‌లోనూ చూడొచ్చు..

అందుకోసం ముందుగా.. https://telugu.news18.com/‌కి లాగిన్ అవ్వండి..

పదో తరగతి ఫలితాల కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించారు అధికారులు. ఈ యాప్ ద్వారా ఫలితాలు విడుదల చేసిన వెంటనే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు లాగిన్ అయి రిజల్ట్స్‌ని తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే ఈ యాప్ ద్వారా పరిష్కరించుకోవచ్చని, అందుకు చాలా బాగా ఉపయోగపడుతుందని తెలిపారు అధికారులు.

తెలంగాణలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 2 వరకు పదోతరగతి పరీక్షలు కొనసాగాయి. 11,103 పాఠశాలలకు చెందిన 5,38,867 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేశారు. వీరిలో 2,76,38 మంది బాలురు, 2,62,479 మంది బాలికలున్నారు. 5,03,117 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా, 35,750 మంది ప్రైవేట్, 20,838 మంది వొకేషనల్ విద్యార్థులు. మొత్తం విద్యార్థుల్లో 5,33,701 మంది పరీక్షలు రాశారు.

ఇవి కూడా చదవండి..

Indian Navy Jobs : టెన్త్ చదివితే చాలు.. ఇండియన్ నేవీలో జాబ్స్.. జీతం.. రూ.50 వేలపైనే

Govt Jobs : IOCLలో రీసెర్చ్ ఆఫీసర్స్, జీతం రూ. 60 వేల పైనే..
First published: May 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...