TS SSC Results: రేపే పదో తరగతి ఫలితాలు... చెక్ చేసుకోండి ఇలా

TS SSC 2019 Results | ఈసారి పదో తరగతి ఫలితాల కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించారు అధికారులు. ఫలితాలు విడుదల చేసిన వెంటనే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు లాగిన్ అయి విద్యార్థుల ఫలితాలను తెలుసుకోవచ్చు.

news18-telugu
Updated: May 12, 2019, 11:08 AM IST
TS SSC Results: రేపే పదో తరగతి ఫలితాలు... చెక్ చేసుకోండి ఇలా
TS SSC Results: రేపే పదో తరగతి ఫలితాలు... చెక్ చేసుకోండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల తేదీ ఖరారైంది. మే 13న ఫలితాలు విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు. మొదట్నుంచీ పదో తరగతి ఫలితాల తేదీపై గందరగోళం నెలకొంది. మరోవైపు ఇంటర్ ఫలితాల వ్యవహారం వివాదాస్పదం కావడంతో అందరి దృష్టీ టెన్త్ రిజల్ట్స్‌పై పడ్డాయి. దీంతో అధికారులు కూడా ఫలితాల విడుదల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పేపర్ వ్యాల్యుయేషన్ దగ్గర్నుంచి ఫలితాల వరకు మానవ తప్పిదాలు, సాంకేతిక పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. మే 13 ఉదయం 11.30 గంటలకు తెలంగాణ సచివాలయంలో పదో తరగలి ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్.

Read this: Career Guidance: టెన్త్ తర్వాత ఏం చదవాలి? తెలుసుకోండి

Telangana SSC Result 2019: చెక్ చేసుకోండి ఇలా...



ముందుగా bsetelangana.org, results.cgg.gov.in వెబ్‌సైట్స్‌లో ఏదన్నా ఓ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
టీఎస్‌ ఎస్ఎస్‌సీ ఫలితాల లింక్ కనిపిస్తుంది.


రోల్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయండి.
వివరాలు నమోదు చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి.
Loading...
ఎస్ఎస్‌సీ ఫలితాలు కనిపిస్తాయి.
ఫలితాలను ప్రింట్ తీసి కాపీ దగ్గర పెట్టుకోండి.
ఫలితాలను https://telugu.news18.com/ వెబ్‌సైట్‌లో కూడా చూడొచ్చు.

Read this: Jobs: టెన్త్ తర్వాత జాబ్... ఈ రంగాల్లో ఉద్యోగావకాశాలు

ఈసారి పదో తరగతి ఫలితాల కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించారు అధికారులు. ఫలితాలు విడుదల చేసిన వెంటనే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు లాగిన్ అయి విద్యార్థుల ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫలితాలకు సంబంధించి విద్యార్థులకు ఏవైనా సందేహాలు ఉంటే ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు అధికారులు. తెలంగాణలో పదోతరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగాయి. మొత్తం 11,103 పాఠశాలలకు చెందిన 5,38,867 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేశారు. వారిలో 2,76,388 మంది బాలురు, 2,62,479 మంది బాలికలు. 5,03,117 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా, 35,750 మంది ప్రైవేట్, 20,838 మంది వొకేషనల్ విద్యార్థులు. మొత్తం విద్యార్థుల్లో మొత్తం 5,33,701 మంది పరీక్ష రాశారు వీరంతా ఇప్పుడు ఫ‌లితాలు ఎప్పుడా అని ఎదురు చూస్తోన్నారు.

Realme 3 Pro: రియల్‌మీ 3 ప్రో... ఎలా ఉందో చూశారా?

ఇవి కూడా చదవండి:

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 11 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్

WhatsApp: ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు... ఫోన్ మార్చాల్సిందే

PAN Card: పాన్ కార్డు దరఖాస్తులో చేయకూడని 10 తప్పులివే...
First published: May 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...