10th Results: టెన్త్ రిజల్ట్స్‌ ఎప్పుడో క్లారిటీ ఇచ్చిన అధికారులు

TS SSC Results 2019 | ఈసారి పదో తరగతి ఫలితాల కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించారు అధికారులు. ఫలితాలు విడుదల చేసిన వెంటనే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు లాగిన్ అయి విద్యార్థుల ఫలితాలను తెలుసుకోవచ్చు.

news18-telugu
Updated: May 8, 2019, 3:51 PM IST
10th Results: టెన్త్ రిజల్ట్స్‌ ఎప్పుడో క్లారిటీ ఇచ్చిన అధికారులు
10th Results: టెన్త్ రిజల్ట్స్‌ ఎప్పుడో క్లారిటీ ఇచ్చిన అధికారులు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
పదో తరగతి పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ పదో తరగతి ఫలితాలపై స్పష్టత ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు. మే మూడో వారంలో తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఉంటాయని తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కార్యదర్శి విజయ్‌కుమార్ న్యూస్18తో చెప్పారు. ఇప్పటికే తెలంగాణలో విడుదలైన ఇంటర్ ఫలితాలు వివాదాస్పదమయ్యాయి. దీంతో పదో తరగతి ఫలితాల విషయంలో తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇంటర్ ఫలితాల తర్వాత పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంతో పదో తరగతి ఫలితాలను ఒకటికి రెండు సార్లు పరిశీలిస్తున్నారు అధికారులు. పేపర్ వ్యాల్యుయేషన్ దగ్గర్నుంచి ఫలితాల వరకు మానవ తప్పిదాలు, సాంకేతిక పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.

Read this: Career Guidance: టెన్త్ తర్వాత ఏం చదవాలి? తెలుసుకోండి

పదో తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందొద్దు. మే మూడో వారంలో ఫలితాలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పటికే జవాబు పత్రాల వ్యాల్యుయేషన్ పూర్తైంది. ఫలితాలు విడుదల చేసేముందు ఐదు అంచెల్లో పరిశీలిస్తున్నాం. ప్రతీ విద్యార్థి గ్రేడ్‌ను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేస్తున్నాం. ఏదైనా సబ్జెక్ట్‌లో సున్నా మార్కులు వస్తే జవాబు పత్రాలను మళ్లీ పరిశీలిస్తున్నాం.

న్యూస్18తో విజయ్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కార్యదర్శి




ఈసారి పదో తరగతి ఫలితాల కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించారు అధికారులు. ఫలితాలు విడుదల చేసిన వెంటనే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు లాగిన్ అయి విద్యార్థుల ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫలితాలకు సంబంధించి విద్యార్థులకు ఏవైనా సందేహాలు ఉంటే ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు అధికారులు. తెలంగాణలో పదోతరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగాయి. మొత్తం 11,103 పాఠశాలలకు చెందిన 5,38,867 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేశారు. వారిలో 2,76,388 మంది బాలురు, 2,62,479 మంది బాలికలు. 5,03,117 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా, 35,750 మంది ప్రైవేట్, 20,838 మంది వొకేషనల్ విద్యార్థులు. మొత్తం విద్యార్థుల్లో మొత్తం 5,33,701 మంది పరీక్ష రాశారు వీరంతా ఇప్పుడు ఫ‌లితాలు ఎప్పుడా అని ఎదురు చూస్తోన్నారు.

Photos: గూగుల్ పిక్సెల్ 3ఏ, 3ఏ ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్స్ ఎలా ఉన్నాయో చూశారా?
Loading...
ఇవి కూడా చదవండి:

Android Q: ఆండ్రాయిడ్ 10 క్యూ రిలీజ్ చేసిన గూగుల్... ఫీచర్స్ ఇవే

Android Q: ఆండ్రాయిడ్ క్యూ ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి... సపోర్ట్ చేసే ఫోన్స్ ఇవే

SBI Flexi Deposit: ఈ డిపాజిట్‌ స్కీమ్‌తో మీకు లాభాలెన్నో...
First published: May 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...