news18-telugu
Updated: April 30, 2019, 1:08 PM IST
ప్రతీకాత్మక చిత్రం
పదోతరగతి విద్యార్థులకు శుభవార్త. తెలంగాణలో టెన్త్ రిజల్ట్స్ మే 6న విడుదలయ్యే అవకాశముంది. మే రెండో వారంలో టెన్త్ రిజల్ట్స్ ఉంటాయని మొదట వార్తలొచ్చాయి. అయితే అంతకంటే ముందే మే 6న పదో తరగతి ఫలితాలు విడుదల చేసేందుకు విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఇంటర్ ఫలితాల వ్యవహారం వివాదాస్పదం కావడంతో, పదో తరగతి ఫలితాల విడుదల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది విద్యా శాఖ. ఇప్పటికే పదో తరగతి గణితం పేపర్లో తప్పులు దొర్లినట్టు బయటపడింది. దీంతో స్పందించిన బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విచారణ జరిపింది. తప్పుల్ని గుర్తించిన బోర్డు... 6 మార్కులు కలుపుతామని స్పష్టత ఇచ్చింది. ఫలితాల విడుదల విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది బోర్డు. మే 6న తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలౌతాయని తెలుస్తున్నా, ఈ విషయంలో విద్యా శాఖ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read this:
WhatsApp IPL Stickers: వాట్సప్‌లో క్రికెట్ స్టిక్కర్స్... డౌన్లోడ్ చేసుకోండి ఇలామార్చి 16 నుంచి ఏప్రిల్ 2 వరకు తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరిగాయి. తెలంగాణ వ్యాప్తంగా 11,103 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షలు రాయడం విశేషం. 2,76,388 మంది బాలురు, 2,62,479 మంది బాలికలు పదో తరగతి పరీక్షలకు దరఖాస్తు చేశారు. మొత్తం 5,38,867 మంది విద్యార్థుల్లో 5,03,117 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా, 35,750 మంది ప్రైవేట్, 20,838 మంది వొకేషనల్ విద్యార్థులు. మొత్తం 5,33,701 మంది పరీక్షకు హాజరయ్యారు. పదోతరగతి ఫలితాలను bsetelangana.org, results.cgg.gov.in వెబ్సైట్లలో చూడొచ్చు.
Photos: సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్... రిలీజైన రెడ్మీ వై3
ఇవి కూడా చదవండి:
ATM: కార్డు లేకపోయినా ఏటీఎంలో డబ్బులు డ్రా... చేసుకోవచ్చు ఇలాPaytm Credit Score: పేటీఎంలో క్రెడిట్ స్కోర్... ఒక్క నిమిషంలో చెక్ చేసుకోవచ్చు ఇలా
WhatsApp: వాట్సప్ ఫోటోలు, వీడియోలతో స్టోరేజ్ ఫుల్ అయిందా? ఈ టిప్స్ ట్రై చేయండి
First published:
April 30, 2019, 1:07 PM IST