TS SSC Results 2019: టెన్త్ ఫలితాల్లో జగిత్యాల హ్యాట్రిక్... మూడోసారి టాప్‌లో నిలిచిన జిల్లాగా రికార్డ్

TS SSC Results 2019 | వరుసగా మూడేళ్లు టాప్‌లో నిలవడమే కాదు... ఏటేటా ఉత్తీర్ణతా శాతం పెరగడం విశేషం. ఒకే జిల్లా పదోతరగతి ఫలితాల్లో హ్యాట్రిక్ సాధించడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమవుతోంది.

news18-telugu
Updated: May 13, 2019, 1:03 PM IST
TS SSC Results 2019: టెన్త్ ఫలితాల్లో జగిత్యాల హ్యాట్రిక్... మూడోసారి టాప్‌లో నిలిచిన జిల్లాగా రికార్డ్
TS SSC Results 2019: టెన్త్ ఫలితాల్లో జగిత్యాల హ్యాట్రిక్... మూడోసారి టాప్‌లో నిలిచిన జిల్లాగా రికార్డ్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో జగిత్యాల జిల్లా రికార్డులు సృష్టిస్తోంది. వరుసగా మూడు సార్లు మొదటి స్థానంలో నిలవడం విశేషం. 2019 తెలంగాణ పదోతరగతి ఫలితాల్లో జగిత్యాల జిల్లా మొదటి స్థానంలో నిలిచినట్టు విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి ప్రకటించారు. జగిత్యాల జిల్లా టాప్‌లో నిలవడం ఇదే మొదటిసారి కాదు. 2017, 2018, 2019 సంవత్సరాల్లో వరుసగా మొదటి స్థానంలో నిలిచింది జగిత్యాల. అంతేకాదు... కొత్తగా జిల్లా ఏర్పడ్డ తర్వాత మూడుసార్లు జరిగిన పదో తరగతి పరీక్షల్లో మూడుసార్లూ జగిత్యాల మొదటి స్థానంలో నిలవడం మరో రికార్డ్. 2017 తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో జగిత్యాల జిల్లా 97.35 శాతం ఉత్తీర్ణత శాతం సాధించడం విశేషం. ఇక 2018లో జగిత్యాల జిల్లా 97.56 శాతంతో మళ్లీ మొదటి స్థానంలో నిలిచింది. ఈసారి 2019 పదో తరగతి ఫలితాల్లో ఏకంగా 99.73 శాతం ఉత్తీర్ణత సాధించి మరో రికార్డ్ సృష్టించింది జగిత్యాల జిల్లా.

TS SSC Results 2019, Telangana ssc results released, Telangana tenth results released, Telangana 10th results released, check Telangana 10th results, check Telangana ssc results, Telangana State Board of Secondary Education, check Telangana tenth results, Jagityal District top, Jagityal District hattrick, తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల, తెలంగాణ పదోతరగతి ఫలితాలు, తెలంగాణ టెన్త్ రిజల్ట్స్, టెన్త్ రిజల్ట్స్, తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, పదోతరగతి ఫలితాలు, జగిత్యాల జిల్లా హ్యాట్రిక్, జగిత్యాల టాప్

వరుసగా మూడేళ్లు టాప్‌లో నిలవడమే కాదు... ఏటేటా ఉత్తీర్ణతా శాతం పెరగడం విశేషం. ఒకే జిల్లా పదోతరగతి ఫలితాల్లో హ్యాట్రిక్ సాధించడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమవుతోంది. జగిత్యాల తర్వాత సిద్దిపేట, కరీంనగర్, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, నిజామాబాద్, జనగామ, కామారెడ్డి జిల్లాలో టాప్ -10లో ఉన్నాయి. చివరి నుంచి చూస్తే హైదరాబాద్, మహబూబ్‌నగర్, భద్రాద్రి కొత్తగూడెం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, జోబులాంబ గద్వాల జిల్లాలున్నాయి.

తెలంగాణ పదో తరగతి ఫలితాలను ఇక్కడ తెలుసుకోండి





ఇవి కూడా చదవండి:

Career Guidance: టెన్త్ తర్వాత ఏం చదవాలి? తెలుసుకోండి
Loading...
Jobs After 10th: టెన్త్ పాసయ్యారా? ఉద్యోగావకాశాలు ఇవే...

 
First published: May 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com