Telangana 10th Result 2019: తెలంగాణ టెన్త్ రిజల్ట్స్‌లో జగిత్యాల టాప్... హైదరాబాద్ ఫ్లాప్

TS SSC 2019 Results | 99.73 శాతం ఉత్తీర్ణతతో జగిత్యాల జిల్లా 99.73 మొదటి స్థానంలో నిలవగా, 83.09 శాతంతో హైదరాబాద్ 83.09 చివరి స్థానంలో నిలిచింది.

news18-telugu
Updated: May 13, 2019, 1:05 PM IST
Telangana 10th Result 2019: తెలంగాణ టెన్త్ రిజల్ట్స్‌లో జగిత్యాల టాప్... హైదరాబాద్ ఫ్లాప్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో జగిత్యాల జిల్లా టాప్‌లో నిలవగా, హైదరాబాద్‌ చివరి స్థానానికే పరిమితమైంది. తెలంగాణ సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి సోమవారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. పదో తరగతి పరీక్షలకు మొత్తం 5,52,280 మంది నమోదు చేసుకోగా 5,46,728 మంది హాజరయ్యారు. వారిలో 5,06,202 మంది రెగ్యులర్ విద్యార్థులు, 40,526 మంది ప్రైవేట్ విద్యార్థులు. మొత్తం 92.43 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గతేడాది పదో తరగతి ఉత్తీర్ణత 83.78 శాతం మాత్రమే. ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఈసారి బాలికల ఉత్తీర్ణత శాతం 93.68 కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం బాలికలు 91.18. పదో తరగతి ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించడం విశేషం. రెగ్యులర్ మాత్రమే కాదు... ప్రైవేట్‌లోనూ బాలికలదే పైచేయి. ప్రైవేట్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 56.53 కాగా, బాలికల ఉత్తీర్ణత శాతం 61.40, బాలుర ఉత్తీర్ణత శాతం 53.65. మొత్తం 11,026 హైస్కూల్స్‌లో 100 శాతం ఉత్తీర్ణతను 4374 పాఠశాలు సాధించాయి. 9 పాఠశాలల్లో సున్నా శాతం ఫలితాలొచ్చాయి. 99.73 శాతం ఉత్తీర్ణతతో జగిత్యాల జిల్లా మొదటి స్థానంలో నిలవగా, 83.09 శాతంతో హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది. బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 97.78 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. జూన్ 10 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనుంది తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్.
తెలంగాణ పదో తరగతి ఫలితాలను ఇక్కడ తెలుసుకోండి



Telangana SSC Result 2019: చెక్ చేసుకోండి ఇలా...


ముందుగా bsetelangana.org, results.cgg.gov.in వెబ్‌సైట్స్‌లో ఏదన్నా ఓ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.


టీఎస్‌ ఎస్ఎస్‌సీ ఫలితాల లింక్ కనిపిస్తుంది.
రోల్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయండి.
Loading...
వివరాలు నమోదు చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి.
ఎస్ఎస్‌సీ ఫలితాలు కనిపిస్తాయి.
ఫలితాలను ప్రింట్ తీసి కాపీ దగ్గర పెట్టుకోండి.
ఫలితాలను https://telugu.news18.com/ వెబ్‌సైట్‌లో కూడా చూడొచ్చు.

ఈసారి పదో తరగతి ఫలితాల కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించారు అధికారులు. రిజల్ట్స్ చూసుకోవడంతో పాటు ఫలితాలకు సంబంధించి విద్యార్థులకు ఏవైనా సందేహాలు ఉంటే ఈ యాప్‌లో కంప్లైంట్ చేయొచ్చు.
తెలంగాణ పదో తరగతి ఫలితాలను ఇక్కడ తెలుసుకోండి



ఇవి కూడా చదవండి:

Career Guidance: టెన్త్ తర్వాత ఏం చదవాలి? తెలుసుకోండి

Jobs After 10th: టెన్త్ పాసయ్యారా? ఉద్యోగావకాశాలు ఇవే...

 
First published: May 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com