తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఈ నెల 17న TS POLYCET-2023 పరీక్షను అధికారులు నిర్వహించారు. ఆ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఈ పరీక్ష జరిగింది. ఈ పాలీసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కు మొత్తం 58,520 మంది బాలురు, 47,222 మంది బాలికలు అప్లై చేసుకోగా.. 54,700 మంది బాలురు, 43,573 మంది బాలికలు ఎగ్జామ్ కు హాజరయ్యారు. మొత్తం 1,05,742 మంది దరఖాస్తు చేసుకోగా.. 98,273 మంది పరీక్షకు హాజరయ్యారని పాలీసెట్ అధికారులు వెల్లడించారు. అంటే మొత్తం 92.94 శాతం హాజరు నమోదైంది. కాగా.. పరీక్షకు హాజరైన విద్యార్థులు, తల్లిదండ్రులు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఫలితాలపై అధికారులు తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈ నెల 26వ తేదీన.. అంటే శుక్రవారం రోజు ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు https://polycet.sbtet.telangana.gov.in/ వెబ్ సైట్లో తమ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.
విద్యార్థులు ఈ స్పెప్స్ తో తమ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది..
Step 1: మొదటగా అధికారిక వెబ్ సైట్ https://polycet.sbtet.telangana.gov.in/ ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం హోం స్క్రీన్ పై కనిపించే POLYCET-2023 Results లింక్ పై క్లిక్ చేయాలి.
Step 3: రిజల్ట్స్ పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో హాల్ టికెట్ నంబర్ తో పాటు సూచించిన వివరాలను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
Step 4: మీ ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. ప్రింట్ తీసుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Exams, JOBS, Ts polycet