Home /News /jobs /

TS POLICE RECRUITMENT 2022 ALERT FOR SI AND CONSTABLE CANDIDATES 1 LAKH PRIZE MONEY FOR LISTING BROKERS EVK

TS Police Recruitment: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. వారిని ప‌ట్టిస్తే రూ.లక్ష బహుమతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TS Police Recruitment 2022 | ఎలాంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నట్లు తెలంగాణ స్టేట్‌‌‌‌‌‌‌‌ లెవల్‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌ రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ బోర్డ్‌‌‌‌‌‌‌‌(టీఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌పీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ) చైర్మన్‌‌‌‌‌‌‌‌ వీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. ఆయ‌న మీడియా ద్వారా ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్య‌ర్థుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

ఇంకా చదవండి ...
  ఎలాంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌ (Recruitment Process) చేస్తున్నట్లు తెలంగాణ స్టేట్‌‌‌‌‌‌‌‌ లెవల్‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌ రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ బోర్డ్‌‌‌‌‌‌‌‌(టీఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌పీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ) చైర్మన్‌‌‌‌‌‌‌‌ వీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. ఆయ‌న మీడియా ద్వారా ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్య‌ర్థుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఆగస్టు 7న ఎస్సై, 21న కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌ ప్రిలిమినరీ పరీక్షలు (Preliminary Exams) నిర్వహించేందుకు.. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదటి వారం లేదా రెండో వారంలో ఫలితాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు ఎవరూ దళారులను నమ్మి మోసపోవద్దని శ్రీనివాస్ రావు సూచించారు. జాబ్స్ (Jobs) ఇప్పిస్తామని ఎవరైనా దళారులు వస్తే వెంటనే చెప్పాలని, అలాంటి వారి సమాచారమిస్తే రూ.లక్ష బహుమతి ఇస్తామని ప్రకటించారు.

  Govt Jobs 2022: ఈ వారం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిన గ‌వ‌ర్న‌మెంట్‌ జాబ్స్‌.. అర్హ‌త‌లు, ద‌ర‌ఖాస్తు విధానం

  భారీగా ద‌ర‌ఖాస్తులు..

  - పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ఇప్పటి వరకు 4.18 లక్షల మంది దరఖాస్తులు వ‌చ్చాయి.
  - మొత్తం దాదాపు 7.6 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
  - 48 శాతం మంది అభ్యర్థులు ఒక్క పోస్టుకు, 29 శాతం మంది రెండు, 17 శాతం మంది మూడు, 4 శాతం మంది నాలుగు, ఒక్క శాతం మంది ఐదు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.
  - 68 శాతం మంది తెలుగు, 32 శాతం మంది ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌ ఎంపిక చేసుకున్నారు.
  - హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచి 28 శాతం అప్లికేషన్లు రాగా.. ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌, నారాయణపేట, సిరిసిల్ల జిల్లాల నుంచి కేవలం ఒక్క శాతమే అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు.
  - అప్లికేషన్లకు శుక్రవారం మే 20, 2022 వ‌ర‌కు గడువు ఉంది..
  - అప్పటి వరకు 5.5 లక్షల మంది అభ్యర్థుల నుంచి 9.5 లక్షల వరకు అప్లికేషన్లు వస్తాయని అధికారులు అంచ‌నాలు వేస్తున్నారు.

  IIT Hyderabad Recruitment: ఐఐటీ హైద‌రాబాద్‌లో రీసెర్చ్ ఫెలో జాబ్స్‌.. వేత‌నం నెల‌కు రూ.42,000.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ వివ‌రాలు

  ముఖ్యంగా కీల‌క‌మైన‌ ఏజ్ లిమిట్ (Age Limit) మరో రెండేండ్లు పెంచాలని వస్తున్న డిమాండ్లపై ప్రభుత్వానిదే నిర్ణయమని టీఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌పీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ వీవీ శ్రీనివాస్ రావు చెప్పారు. సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అమలు చేస్తామని తెలిపారు.

  ఆగ‌స్టులో ప‌రీక్ష‌
  ఆగస్టులో పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు అధికారుల చెబుతున్నారు. ఎగ్జామ్ సెంటర్లలోనే అభ్యర్థుల ఫేస్‌‌‌‌‌‌‌‌, అరచేయి బయోమెట్రిక్ (Biometric), డిజిటల్‌‌‌‌‌‌‌‌ సైన్‌‌‌‌‌‌‌‌ తీసుకొనే అవ‌కాశం ఉంది. అంతే కాకుండా పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి హెల్ప్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ సర్వీస్ కు 11,972 కాల్స్‌‌‌‌‌‌‌‌ వచ్చాయని, అందులో 11,449 పరిష్కంచామని శ్రీనివాస్ రావు చెప్పారు.

  Govt Jobs 2022: ఈ వారం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిన గ‌వ‌ర్న‌మెంట్‌ జాబ్స్‌.. అర్హ‌త‌లు, ద‌ర‌ఖాస్తు విధానం

  ఈ నెల 21 నుంచి డేటా సెంట్రలైజ్ చేయనున్నట్లు తెలిపారు. అప్లికేషన్ల ఆధారంగా ఎగ్జామ్ సెంటర్లు (Exam centres) , ఇన్విజిలేటర్లు, బయోమెట్రిక్‌‌‌‌‌‌‌‌ టీమ్స్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేస్తామన్నారు. క్వశ్చన్ పేపర్లు, ఓఎమ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షీట్స్‌‌‌‌‌‌‌‌తో పాటు హాల్‌‌‌‌‌‌‌‌ టికెట్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు కనీసం రెండు నెలలు పట్టే అవకాశం ఉందన్నారు.
  Published by:Sharath Chandra
  First published:

  Tags: Jobs in telangana, Police jobs, Telangana police jobs, Ts jobs

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు