Home /News /jobs /

TS POLICE RECRUITMENT 2022 ALERT FOR CANDIDATES ANOTHER OPTION IN POLICE JOBS APPLICATION RECRUITMENT BOARD KEY ANNOUNCEMENT EVK

TS Police Recruitment 2022: అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. పోలీస్ జాబ్స్ అప్లికేష‌న్‌లో మ‌రో ఆప్ష‌న్‌.. రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క ప్ర‌క‌ట‌న

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

Telangana Jobs 2022 | తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీకి ద‌ర‌ఖాస్తు గడువును మే 26, 2022తో పూర్త‌యింది. తాజాగా పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక నిర్ణ‌యం తీసుకొంది. ఎవ‌రైతే ద‌ర‌ఖాస్తు స‌మ‌యంలో ఫోటో, సంత‌కం స‌రిగా చేయ‌లేదో వారికి మ‌రో అవ‌కాశం ఇచ్చేలా ఎడిట్ ఆప్ష‌న్ అందిస్తోంది.

ఇంకా చదవండి ...
    తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీకి ద‌ర‌ఖాస్తు గడువును మే 26, 2022తో పూర్త‌యింది. తాజాగా పోలీస్ రిక్రూట్‌మెంట్ (Police Recruitment) బోర్డు కీలక నిర్ణ‌యం తీసుకొంది. ఎవ‌రైతే ద‌ర‌ఖాస్తు స‌మ‌యంలో ఫోటో, సంత‌కం స‌రిగా చేయ‌లేదో వారికి మ‌రో అవ‌కాశం ఇచ్చేలా ఎడిట్ ఆప్ష‌న్ అందిస్తోంది. జూన్ 9, 2022 వ‌ర‌కు ఎడిట్ ఆప్ష‌న్ చేసుకొనేందుకు అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే సంబంధిత పొర‌పాట్లు జ‌రిగిన అభ్య‌ర్థుల‌కు మెయిల్‌ (Mail0, మెసేజ్‌లు పంపించారు. ఇక రాత ప‌రీక్షకు సంబంధించి ఆగ‌స్టు 7, 2022న ఎస్సై ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఆగ‌స్టు 21, 2022న కానిస్టేబుల్ ప‌రీక్ష‌లు (Constable Exams) నిర్వ‌హిస్తారు. ఈసారి నోటిఫికేష‌న్‌లో16,027 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 26వ తేదీ రాత్రి 10 గంటలలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

    After 10th Class: నెక్స్ట్ ఏంటీ..? ప‌దోత‌ర‌గ‌తి త‌రువాత ఏ కోర్సు ఎంచుకోవాలి.. ఉద్యోగ అవ‌కాశాల వివ‌రాలు

    ఎలా ఎడిట్ చేసుకోవాలి..

    Step 1 - ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.tslprb.in/ లోకి వెళ్లాలి.

    Step 2 - కుడి వైపు పైన Login ఆప్ష‌న్‌ను క్లిక్ చేయాలి.

    Step 3 - మీ ఫోన్ నంబ‌ర్ పాస్‌వ‌ర్డ్‌తో లాగిన్ అవ్వాలి.

    Step 4 - త‌రువాత అప్లికేష‌న్‌లో మార్పుల‌కు సంబంధిచిన ఆప్ష‌న్‌ల‌ను క్లిక్ చేసి పూర్తి చేయాలి.

    Step 5 - త‌రువాత స‌రి చూసుకొని స‌బ్‌మిట్ చేయాలి.

    Internships: ఫైన‌ల్ ఇయ‌ర్ విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. రూ.10,000ల‌తో కేంద్ర సంస్థ‌లో ఇంట‌ర్న్‌షిప్ అవ‌కాశం

    ఈ సారి ద‌ర‌ఖాస్తు వివ‌రాల్లో ప‌లు ఆస‌క్తికర విష‌యాలు ఉన్నాయి. రాష్ట్రంలో పోలీస్‌, ఎక్సైజ్‌, జైళ్లు, రవాణా, అగ్నిమాపకశాఖల్లో మొత్తం 17,516 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడగా.. 7,33,559 అభ్యర్థులు మొత్తంగా 12,91,006 దరఖాస్తులు సమర్పించారు. ఇందులో అత్యధికంగా 51% దరఖాస్తులు బీసీ వర్గాల నుంచి వ‌చ్చాయి.
     ఈ సారి పోలీస్‌ ఉద్యోగాల (Police Jobs)కోసం అత్యధికంగా హైదరాబాద్‌, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట (Suryapeta) జిల్లాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. మొత్తం దరఖాస్తుల్లో ఆ ఐదు జిల్లాల నుంచే 33% ఉండటం గమనార్హం. అతి తక్కువగా ములుగు, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, నారాయణపేట, జనగామ, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి వచ్చాయి. ఈ జిల్లాలన్నీ కలిపి మొత్తం దరఖాస్తుల్లో కేవలం 7% మాత్రమే ఉన్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి





    మ‌హిళా అభ్య‌ర్థులు ఎక్కువే..

    ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి 41% దరఖాస్తులు రాగా, ఓసీ సామాజిక వర్గం నుంచి 7.65% దరఖాస్తులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ సహా ఇతర రాష్ర్టాలకు చెందిన అభ్యర్థుల నుంచి 3.48% దరఖాస్తులు వచ్చాయి. మహిళా అభ్యర్థుల నుంచి 2,76,311 దరఖాస్తులు (21%) వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో యూనిఫాం ఉద్యోగాల‌పై మ‌హిళ‌లు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నార‌ని నిపుణులు అంటున్నారు.

    Published by:Sharath Chandra
    First published:

    Tags: JOBS, Jobs in telangana, Telangana police jobs, Ts jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు