Home /News /jobs /

TS POLICE JOBS THE APPLICATION PROCESS FOR COMPLETED POLICE JOBS DO YOU KNOW HOW MANY PEOPLE COMPETE FOR A POST EVK

TS Police Jobs: ముగిసిన పోలీస్ ఉద్యోగాల ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌.. ఒక పోస్టుకు ఎంత మంది పోటీ తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TSLPRB | తెలంగాణ‌ లో యూనిఫాం జాబ్స్ అప్లికేష‌న్ ప్రాసెస్ (Application Process) ముగిసింది. సీఎం కేసీఆర్ భారీ ఉద్యోగ ప్ర‌క‌ట‌న చేసిన త‌రువాత పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) నోటిఫికేష‌న్ విడుద‌ల చేశాయి. తాజ‌గా ద‌ర‌ఖాస్తు గ‌డువు ముగిసింది.

ఇంకా చదవండి ...
    తెలంగాణ‌ (Telangana) లో యూనిఫాం జాబ్స్ అప్లికేష‌న్ ప్రాసెస్ (Application Process) ముగిసింది. సీఎం కేసీఆర్ భారీ ఉద్యోగ ప్ర‌క‌ట‌న చేసిన త‌రువాత పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) నోటిఫికేష‌న్ విడుద‌ల చేశాయి. తాజ‌గా ద‌ర‌ఖాస్తు గ‌డువు ముగిసింది. ఈ దరఖాస్తులకు సంబంధించి వివకాలను అధికారులు వెల్లడించాయి. పోలీస్‌, ఎక్సైజ్‌, జైళ్లు, రవాణా, అగ్నిమాపక శాఖల్లోని మొత్తం 17,516 పోస్టులకు విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేయగా గడువు ముగిసే సమయానికి 12.70 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలిపాయి.

    Indian Bank SO Recruitment 2022: ఇండియ‌న్ బ్యాంక్‌లో 312 ఎస్ఓ జాబ్స్‌.. వేత‌నం, అర్హ‌త‌లు, అప్లికేష‌న్ వివ‌రాలు

    ఎస్సై ప్రిలిమ్స్ ఎప్పుడు ఉండొచ్చు..
    తాజాగా యూనిఫాం సర్వీసెస్‌ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ముగిసినందున ప్రిలిమ్స్‌ పరీక్షల నిర్వహణపై టీఎస్‌ఎల్పీఆర్బీ అధికారులు దృష్టి సారించారు. దాద‌పుగా ఆగస్టు మొదటి వారంలో ఎస్సై ప్రిలిమ్స్‌, మూడో వారంలో కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ పరీక్షలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. కానిస్టేబుల్‌ పోస్టుల్లో బ్యాక్‌లాగ్‌కు తావులేకుండా ముందుగా ఎస్సై ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు అధికారులు తెలిపారు. జైళ్లు, అగ్నిమాపకశాఖల్లోని పోస్టుల భర్తీకి తేదీల పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

    Do not tattoo: యువతకు అలర్ట్.. ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే ఈ పని మాత్రం చేయొద్దు

    ఈసారి ఎక్సైజ్‌, రవాణాశాఖల పోస్టుల భర్తీని టీఎస్‌ఎల్పీఆర్బీ నిర్వ‌హిస్తోంది. అలేగా ఈసారి యూనిఫాం పోస్టులకు అభ్య‌ర్థులు మంచి ఆస‌క్తి చూపించారు. అన్ని శాఖ‌ల్లో 17,516 పోస్టుల‌కు 12.70 లక్షలకు పైగా దరఖాస్తులు వ‌చ్చాయి. అంటే ఒక్కొక్క పోస్టుకు సగటున 72 దరఖాస్తులు వచ్చినట్టయ్యింది. మొత్తం 7.20 లక్షల మంది అభ్యర్థులు ఈ దరఖాస్తులను సమర్పించారు.

    వివిధ విభాగాలకు విడివిడిగా దరఖాస్తులు స్వీకరించడంతో పలువురు అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేశారు. దరఖాస్తుదారుల్లో 25 శాతం మంది మహిళలు ఉండే అవ‌కాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచి రోజుకు సగటున 49 వేల మంది చొప్పున దరఖాస్తు చేసుకొన్నట్టు బోర్డు అధికారులు చెప్తున్నారు.

    Jobs in Andhra Pradesh: కృష్ణా జిల్లాలో 126 కాంట్రాక్టు ఉద్యోగాలు.. వేత‌నం నెల‌కు రూ.ల‌క్ష‌పైనే.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ వివ‌రాలు

    వాక్ -ఇన్ ఇంటర్వ్యూ ద్వారా టీచర్ పోస్టుల భర్తీ.. 

    రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్- మైసూర్(RIEM), కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ ఉపాధ్యాయ పోస్టులను వాక్ -ఇన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనుంది. ఇప్పటికే ఇంటర్వ్యూలు (మే 25) ప్రారంభం కాగా, మే 28 వరకు కొనసాగనున్నాయి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా వివిధ భాషలకు సంబంధించి మొత్తం 25 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. పీజీటీ పోస్టుల ఇంటర్వ్యూ(Interview) సమయం మే 25న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కేటాయించారు. టీజీటీ పోస్ట్‌కు(TGT Post) సంబంధించి మే 26న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఇంటర్వ్యూ ఉంటుంది. మే 27న డబ్ల్యూఈటీ డ్యాన్స్ టీచర్ పోస్టు(Teacher Post) ఇంటర్వ్యూ, మే 28న ప్రైమరీ, ప్రీ ప్రైమరీ, ఒకేషనల్ టీచర్లు, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Jobs in telangana, Police jobs, Telangana jobs, Telangana police jobs, Ts jobs, Tslprb

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు