TS Police Jobs : పోలీస్ ఉద్యోగాల ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్

TS Police Jobs | కానిస్టేబుల్ సివిల్ పోస్టులకు అత్యధికంగా 89.91 శాతం మంది, ఏఎస్సై ఫింగర్ ప్రింట్ బ్యూరోలో 85.70శాతంగా ఉంది. ఎస్సై సివిల్ పోస్టులకు 72.41 శాతం మంది అభ్యర్థులు కనీస అర్హత మార్కులు సాధించారు. రాత పరీక్షలకు సంబంధించి ఫైనల్ కీ, ఓఎంఆర్ ఆన్సర్ షీట్స్ ఈ నెల 27 నుంచి లాగిన్ ద్వారా పొందొచ్చని పోలీస్ నియామక బోర్డు ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు.

news18-telugu
Updated: May 26, 2019, 6:10 PM IST
TS Police Jobs : పోలీస్ ఉద్యోగాల ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 26, 2019, 6:10 PM IST
పోలీస్‌శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్స్ టీఎస్‌ఎల్పీఆర్బీ విడుదల చేసింది. వివిధ పోస్టుల పరీక్షల్లో అభ్యర్థుల హాజరు, పొందిన మార్కుల వివరాలను ఈ నెల 26 నుంచి వ్యక్తిగత లాగిన్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు అధికారులు. కానిస్టేబుల్ సివిల్ పోస్టులకు అత్యధికంగా 89.91 శాతం మంది, ఏఎస్సై ఫింగర్ ప్రింట్ బ్యూరోలో 85.70శాతంగా ఉంది. ఎస్సై సివిల్ పోస్టులకు 72.41 శాతం మంది అభ్యర్థులు కనీస అర్హత మార్కులు సాధించారు. రాత పరీక్షలకు సంబంధించి ఫైనల్ కీ, ఓఎంఆర్ ఆన్సర్ షీట్స్ ఈ నెల 27 నుంచి లాగిన్ ద్వారా పొందొచ్చని పోలీస్ నియామక బోర్డు ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఏమైనా ఇబ్బందులుంటే రిజిస్ట్రేషన్ నెంబర్ పేర్కొంటూ support@tslprb.in చిరునామాకి ఈమెయిల్ చేయాలని లేదా 93937 11110, 93910 05006 నెంబర్లకు ఫోన్ చేయాలని కోరారు.

నియామక పరీక్షల్లో వచ్చిన మార్కులపై అభ్యర్థులకు సందేహాలుంటే పున: పరిశీలన, పున:మూల్యాంకనానికి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ నెల 28 ఉదయం 8 నుంచి 30 రాత్రి 8 గంటల వరకు సంబంధిత లాగిన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని.. ఇందుకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2వేలు, సాధారణ అభ్యర్థులు రూ.3 వేలు ఫీజు కింద ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలన్నారు. పున: పరిశీలన, మూల్యాంకనానికి దరఖాస్తు చేసిన అబ్యర్థులు 30వ తేదీ నుంచి కొన్నిరోజుల్లో సమాధానం పంపిస్తామని వెల్లడించారు. ఈ ఫలితాలు వచ్చిన తర్వాతే అభ్యర్థులు వ్యక్తిగత వివరాల్లో ఏమైనా మార్పులు చేసుకునే అవకాశముంటుంది. ఆ వెంటనే తుది మెరిట్ జాబితా విడుదలవుతుంది.

ఇవి కూడా చదవండి..

Govt Jobs : Vizag Steel‌లో మేనేజ్‌మెంట్‌లో జాబ్స్... పూర్తి వివరాలు ఇవే..

First published: May 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...