హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS Police Jobs: పోలీస్‌ ఈవెంట్స్‌కు సిద్ధం అవుతున్నారా.. ఈ టిప్స్ ఫాలో అయితే బెస్ట్‌!

TS Police Jobs: పోలీస్‌ ఈవెంట్స్‌కు సిద్ధం అవుతున్నారా.. ఈ టిప్స్ ఫాలో అయితే బెస్ట్‌!

(ఫ్రతీకాత్మక చిత్రం)

(ఫ్రతీకాత్మక చిత్రం)

TS Police Jobs | తెలంగాణ‌లో పోలీస్ పోస్టుల‌కు ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతుంటారు. అందులో ముఖ్యంగా ఫిజిక‌ల్ ఈవెంట్ కీల‌క‌మైంది. ఈ ఈవెంట్‌లో క్వాలిఫై అవ్వాలి అంటే పాటించాల్సిన టిప్స్ తెలుసుకోండి.

తెలంగాణ‌ (Telangana) లో పోలీస్‌, గ్రూప్‌-1, టీఎస్ఎస్‌పీసీడీఎల్‌లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యాయి. దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తయింది. ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడే పరీక్ష, యూనిఫాం ఉద్యోగాలు. ఈ నేప‌థ్యంలో ఫిజిక‌ల్ ఈవెంట్ (Physical Events) చాలా ముఖ్య‌మైంది ఈ నేప‌థ్య‌లో ఫిజిక‌ల్ ఈవెంట్‌లో మంచి ఫ‌లితాలు సాధించడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి.

ఎస్సై పోస్టుల‌కు సంబంధించి ఫిజిక‌ల్ టెస్ట్ అర్హ‌త‌లు..

- 11, 12, 13, 14, 16, 17, 18 నెంబర్ పోస్టులకు పురుషులు 167.6 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. 11, 12 పోస్టులకు మహిళలు 152.5 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి.

AP Intermediate: విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. ఇంట‌ర్ కాలేజీ అడ్మిష‌న్‌లు, క్లాస్‌ల తేదీలు విడుద‌ల

- ఏజెన్సీ ఏరియాల్లోని వారైతే పురుషులు 160 సెంటీమీటర్లు, మహిళలు 150 సెంటీమీటర్లు ఉండాలి.

- 31, 32, 33 నెంబర్ పోస్టులకు పురుషులు 162 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. మహిళలు 152.5 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. ఏజెన్సీ ప్రాంతాలకు చెందినవారైతే పురుషులు 160 సెంటీమీటర్లు, మహిళలు 150 సెంటీమీటర్లు ఉండాలి.

- లాంగ్ జంప్ ఈవెంట్‌లో పురుషులు (జనరల్) 4 మీటర్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 3.5, షాట్‌పుట్ ఈవెంట్‌‌లో ఇద్దరికీ 6 మీటర్ల క్వాలిఫయింగ్ డిస్టెన్స్ ఉంటుంది. మహిళ అభ్యర్థులకు లాంగ్ జంప్ 2.50 మీటర్లు, షాట్ పుట్ 4 మీటర్ల క్వాలిఫయింగ్ డిస్టెన్స్ ఉంటుంది.

ONGC Recruitment 2022: ఓఎన్‌జీసీ రాజ‌మండ్రి యూనిట్‌లో కాంట్రాక్టు ఉద్యోగాలు.. వేత‌నం, అప్లికేష‌న్ ప్రాసెస్ వివ‌రాలు

కానిస్టేబుల్ పోస్టుల‌కు సంబంధించి ఫిజిక‌ల్ మెజ‌ర‌మెంట్స్‌

- పోస్టు కోడ్ 21 నుంచి 27 వ‌ర‌కు (పురుషుల‌కు ) ఎత్తు 167.6సెం.మీ ఉండాలి. మ‌హిళ‌ల‌కు పోస్టు కోడ్ 21,22, 28లో ఎత్తు 152.5 సెం.మీ ఉండాలి.

- ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే వారికి పోస్టు కోడ్ 21 నుంచి 27 వ‌ర‌కు (పురుషుల‌కు ) ఎత్తు 160 సెం.మీ ఉండాలి. మ‌హిళ‌ల‌కు పోస్టు కోడ్ 21,22, 28లో ఎత్తు 150 సెం.మీ ఉండాలి.

- లాంగ్ జంప్ ఈవెంట్‌లో పురుషులు (జనరల్) 4 మీటర్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 3.5, షాట్‌పుట్ ఈవెంట్‌‌లో ఇద్దరికీ 6 మీటర్ల క్వాలిఫయింగ్ డిస్టెన్స్ ఉంటుంది. మహిళ అభ్యర్థులకు లాంగ్ జంప్ 2.50 మీటర్లు, షాట్ పుట్ 4 మీటర్ల క్వాలిఫయింగ్ డిస్టెన్స్ ఉంటుంది.

Wipro Recruitment 2022: ఫ్రెష‌ర్స్‌కు గుడ్ న్యూస్ విప్రోలో జాబ్ ఓపెనింగ్స్‌.. అప్లికేష‌న్‌, అర్హ‌త‌ల వివ‌రాలు

JEE Alternatives: జేఈఈతో సంబంధం లేకుండా ఇంజనీరింగ్ చదివే అవకాశం.. ఆల్టర్నేటివ్ ఎంట్రన్స్ టెస్ట్‌లు ఇవే..

తీసుకోవాల్సిన ఆహారం..

ఫిజిక‌ల్ ఈవెంట్‌లో మంచి ఫ‌లితాలు రావాలి అంటే.. ఆహారం చాలా ముఖ్యం అభ్య‌ర్థులు తీసుకోవాల్సిన ఆహారం పాలు, నానబెట్టిన శనగలు, పెసర్లు, ఉడకబెట్టిన కోడిగుడ్డు, డ్రై ఫ్రూట్స్‌, రాగి జావ వంటి ఎక్కువ బ‌లాన్ని ఇచ్చే ఆహారం మంచిది. తొంద‌ర‌గా అరిగే ఇడ్లీ, ఉప్మా, సాదా దోశ తీసుకోవాలి. పండ్లు అధికంగా తీసుకొవాలి. ముఖ్యంగా దానిమ్మ, అరటి, ఆపిల్‌, జామ వంటి బ‌లాన్ని ఇచ్చే పండ్లు బెస్ట్‌. రాత్రి పూట చపాతి, జొన్నరొట్టెలు వంటి బ‌రువు పెర‌గ‌కుండా ఉండే ఆహారం మంచిది. జంక్ ఫుడ్స్‌, సిగ‌రెట్‌, మందుకు దూరంగా ఉండాలి.

ఈవెంట్ ప్రాక్టీస్ ఎలా చేయాలి.

- ర‌న్నింగ్ చేసే ముందు క‌చ్చితంగా స్ట్రెచింగ్‌ వర్కవుట్ చేయాలి.

- రోజు రెండు గంట‌లు ప్రాక్టీస్ త‌ప్ప‌నిస‌రి

- ఒకేసారి పరిగెత్తకుండా రోజువారీ వేగాన్ని పెంచుకుంటూ, వారానికి ఒకసారి లాంగ్‌ రన్‌కు ప్రిపేర‌వ్వాలి.

- లాంగ్‌ రన్‌లో స్ట్రెయిట్‌గా పరిగెత్తడంతో పాటు కర్వ్‌స్‌లో పరిగెత్తడం ప్రాక్టీస్‌ చేయాలి.

- టేకాఫ్‌ పాయింట్‌ నుంచి ఇన్నర్‌ బోర్డర్‌లో మొదట నెమ్మదిగా స్టార్ట్‌ చేస్తూ వేగాన్ని పెంచుకుంటూ మీడియం స్టెప్స్‌, అదేవిధంగా లాంగ్‌ స్టెప్స్‌ చివరగా స్పీడ్ పెంచాలి.

- షటిల్‌ రన్‌, సైక్లింగ్‌, జిగ్‌ జాగ్‌ రన్‌, ప్రాక్టీస్ చేస్తే మంచింది.

- ముఖ్యంగా పరిగెత్తేటప్పుడు శరీరాన్ని వంచకుండా స్ట్రెయిట్‌గా, మెడ భాగాన్ని రిలాక్స్‌గా పెండుతూ, ముందువైపు చూస్తూ హ్యాండ్స్‌ స్వింగ్‌ చేయడంతో పాటు టోస్‌ మీద పరిగెత్తడం ప్రాక్టీస్‌ చేయాలి.

First published:

Tags: Govt Jobs 2022, JOBS, Telangana police jobs, Ts jobs, TSPSC

ఉత్తమ కథలు