TS POLICE JOBS PREPARING FOR A POLICE JOB NOTICE THESE CHANGES IN THE NOTIFICATION THIS TIME EVK
TS Police Jobs: పోలీస్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా.. ఈసారి నోటిఫికేషన్లో ఈ మార్పులు గమనించండి
(ప్రతీకాత్మక చిత్రం)
TS Police Jobs | తెలంగాణలోని నిరుద్యోగులు ఎదురుచూస్తున్న పోలీస్ శాఖకు సంబంధించి 16, 614 పోలీస్ కొలువులకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ సోమవారం నోటిఫికేషన్విడుదల చేసింది. ఈసారి నోటిఫికేషన్లో ఫిజికల్ ఈవెంట్లో కొన్ని మార్పులు చేశారు.
తెలంగాణలోని నిరుద్యోగులు ఎదురుచూస్తున్న పోలీస్ శాఖకు సంబంధించి 16, 614 పోలీస్ కొలువులకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ సోమవారం నోటిఫికేషన్విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఎస్ఐ పోస్టులు 587 ఉండగా.. కానిస్టేబుల్పోస్టులు 16,027 ఉన్నాయి. మే 2 నుంచి 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రకటించారు. దరఖాస్తు ప్రక్రియ 2022 మే 2న ప్రారంభం కానుంది. 2022 మే 22 లోగా దరఖాస్తు చేయొచ్చు. ఈ నోటిఫికేషన్లో కానిస్టేబుల్ పోస్టులు 16,027, ఎస్ఐ పోస్టులు 587 ఉన్నాయి. అయితే ఈసారి ఫిజికల్ ఈవెంట్లో గతంలో కన్నా కొన్ని మార్పులు చేశారు. అవేంటో తెలుసుకోండి..
గతంలో.. పురుషులకు రన్నింగ్ విభాగంలో 100 మీటర్స్ రన్నింగ్, హైజంప్, 800 మీటర్ల రన్నింగ్ నిర్వ హించడం లేదు. అందులో మార్పులు చేశారు.
ఈ సారి మార్పు.. ప్రస్తుతం పురుషులకు 1600 మీటర్లు 7నిమిషాల 15 సెకన్లలో పూర్తి చేయాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి ఇదే దూరం 9 నిమిషల 30 సెకన్లో పూర్తి చేయాలి. లాంగ్ జంప్ 4 మీటర్లు, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి 3.50 మీటర్లు, షాట్‌పుట్(7.26 కేజీల) 6 మీటర్లు గా
నిర్వహిస్తున్నారు.
ఇక మహిళలకు 800 మీటర్ల రన్నింగ్ 5 నిమిషాల 20 సెకన్లులో పూర్తి చేయాలి. మహిళల లాంగ్ జంప్ 2.50 మీటర్లు, షాట్‌పుట్ (4 కేజీలబరువు) 4 మీటర్లుగా నిర్వ హిస్తున్నారు.
కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ఫిజికల్ మెజరమెంట్స్
- పోస్టు కోడ్ 21 నుంచి 27 వరకు (పురుషులకు ) ఎత్తు 167.6సెం.మీ ఉండాలి. మహిళలకు పోస్టు కోడ్ 21,22, 28లో ఎత్తు 152.5 సెం.మీ ఉండాలి.
- ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే వారికి పోస్టు కోడ్ 21 నుంచి 27 వరకు (పురుషులకు ) ఎత్తు 160 సెం.మీ ఉండాలి. మహిళలకు పోస్టు కోడ్ 21,22, 28లో ఎత్తు 150 సెం.మీ ఉండాలి.
- లాంగ్ జంప్ ఈవెంట్లో పురుషులు (జనరల్) 4 మీటర్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 3.5, షాట్‌పుట్ ఈవెంట్లో ఇద్దరికీ 6 మీటర్ల క్వాలిఫయింగ్ డిస్టెన్స్ ఉంటుంది. మహిళ అభ్యర్థులకు లాంగ్ జంప్ 2.50 మీటర్లు, షాట్ పుట్ 4 మీటర్ల క్వాలిఫయింగ్ డిస్టెన్స్ ఉంటుంది.
ఎస్సై పోస్టులకు సంబంధించి ఫిజికల్ టెస్ట్ అర్హతలు..
- 11, 12, 13, 14, 16, 17, 18 నెంబర్ పోస్టులకు పురుషులు 167.6 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. 11, 12 పోస్టులకు మహిళలు 152.5 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి.
- ఏజెన్సీ ఏరియాల్లోని వారైతే పురుషులు 160 సెంటీమీటర్లు, మహిళలు 150 సెంటీమీటర్లు ఉండాలి.
- 31, 32, 33 నెంబర్ పోస్టులకు పురుషులు 162 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. మహిళలు 152.5 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. ఏజెన్సీ ప్రాంతాలకు చెందినవారైతే పురుషులు 160 సెంటీమీటర్లు, మహిళలు 150 సెంటీమీటర్లు ఉండాలి.
- లాంగ్ జంప్ ఈవెంట్లో పురుషులు (జనరల్) 4 మీటర్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 3.5, షాట్‌పుట్ ఈవెంట్లో ఇద్దరికీ 6 మీటర్ల క్వాలిఫయింగ్ డిస్టెన్స్ ఉంటుంది. మహిళ అభ్యర్థులకు లాంగ్ జంప్ 2.50 మీటర్లు, షాట్ పుట్ 4 మీటర్ల క్వాలిఫయింగ్ డిస్టెన్స్ ఉంటుంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.