TS POLICE JOBS PREPARATION TIPS ARE YOU PREPARING FOR POLICE JOBS FOCUSING ON THIS SUBJECT WILL GIVE YOU THE BEST SCORE EVK
TS Police Jobs: పోలీస్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారా.. ఈ సబ్జెక్ట్‌పై దృష్టి పెడితే బెస్ట్ స్కోర్ చేయొచ్చు
ప్రతీకాత్మక చిత్రం
TS Police Jobs Preparation Tips | తెలంగాణలో ప్రస్తుతం కొలువుల జాతర సాగుతోంది. ఇప్పిటికే.. పోలీస్, గ్రూప్-1, టీఎస్ఎస్పీసీడీఎల్లో జాబ్స్ పడ్డాయి. ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడే పరీక్ష, యూనిఫాం ఉద్యోగాలు. ఈ నేపథ్యంలో ఎక్కువ మార్కులు సాధించాలి అంటే ఏ సబ్జెక్ట్ పై ఎక్కువ దృష్టి పెట్టాలో అభ్యర్థులు తెలుసుకోవాలి.
తెలంగాణలో ప్రస్తుతం కొలువుల జాతర సాగుతోంది. ఇప్పిటికే.. పోలీస్, గ్రూప్-1, టీఎస్ఎస్పీసీడీఎల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే దాదాపుగా పూర్తయింది. ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడే పరీక్ష, యూనిఫాం ఉద్యోగాలు. ఈ నేపథ్యంలో ఎక్కువ మార్కులు సాధించాలి అంటే ఏ సబ్జెక్ట్ పై ఎక్కువ దృష్టి పెట్టాలో అభ్యర్థులు తెలుసుకోవాలి. అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం అన్ని పోస్టుల పరీక్షల్లో తెలంగాణ సెలబస్ కమిటీలో నివేదిక ప్రకారం తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సంస్కృతి టాపిక్స్ ఎక్కువ మార్కులు వస్తున్నాయి. కానిస్టేబుల్, గ్రూప్-1 (Group-1)లో ఎక్కువ స్కోర్ చేయడానికి ఈ టాపిక్ ఎక్కువగా ఉపయోగపడుతుంది.
గత పరీక్షల్లో తెలంగాణ భావన, సమీకరణ, ఉద్యమంలో ఎస్ఐలో 30 మార్కులు వచ్చాయి. కానిస్టేబుల్ పరీక్షలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర అంశాలు, గత పోటీపరీక్షలో 2018 పేపర్ ప్రకారం తెలంగాణ ఉద్యమం నుంచి 12, తెలంగాణ సంస్కృతి నుంచి 12, తెంగాణ ఉద్యమం గురించి 12 మార్కులు వచ్చాయి. దాదాపు 38 ప్రశ్నలు వచ్చాయి. గ్రూప్-1 ప్రిపేర్ అయ్యే వారి తెలంగాణ వారసత్వం, తెలంగాణ కళలు, అదనంగా ఉంటాయి. దాదాపు ఈ అంశాల నుంచి 15 మార్కులు వచ్చే అవకాశం ఉంది.
పోటీపరీక్షలో ఉన్న వారికి తెలంగాణ భావన, సమీకరణ, ఉద్యమం, తెలంగాణ వారసత్వం, తెలంగాణ కళలు, తెలంగాణ చరిత్ర అంశాలు తప్పకుండా ఉంటాయి. గ్రూప్-1 మెయిన్స్‌లో తెలంగాణ ఉద్యమం 150 మార్కులు ఉంటాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు చదవాల్సిన అంశాలు.
తెలంగాణ పండగలు, జాతరలు, ఉర్సులు, తెలంగాణ పర్యటక ప్రదేశాల, తెలంగాణ కళలు, జానపద అంశాలు, తెలంగాణ ఆధునిక సాహిత్యం, తెలంగాణ సాంస్కృతి పుర్జీవనం అంశాలపై పట్టు ఉండాలి. ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన 33 జిల్లాల గురించి పూర్తి అవగాహను ఉండాలి. తెలంగాణ చరిత్రకు సంబంధించి శాతవాహనులు, ఇక్షావాకులు, విష్ణుకుండికులు, కాకతీయులు, కుతుబ్‌షాహిలు, నిజాం, హైదరాబాద్ అభివృద్ధి, రజాకార్లతో పోరాటం హైదరాబాద్ స్వాతంత్ర్యం అంశాలు ప్రిపేర్ అవ్వాలి.
తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా రైతంగా పోరాటం, ముల్కి ఉద్యమం, 1969 తెలంగాణ తొలి దశ ఉద్యమం, అంనతరం తెలంగాణ మలి దశ ఉద్యమం, దేవగౌడ ప్రకటన, భువనగిరి సభ, కాకినాడ తీర్మాణం, వరంగల్ డిక్లేషన్, జేఏసీ ఉద్యమాలు, సమ్మెలు, సాగరహారం వంటి దీక్షలపై అవగాహన ఉండాలి. ఈ అంశాలతో ఎక్కువ స్కోర్ చేయంచ్చు.
ఈ సబ్జెక్టు చదవడంతోపాటు ఎక్కువగా మనం చేసుకోవాలి. ఎదుటివారితో చర్చించాలి. ఉద్యామాల ఆర్డర్ తెలుసుకోవాలి. దీని ద్వారా ఎక్కుగా గుర్తుంటుంది. కచ్చితంగా అన్ని పరీక్షల్లో ఈ సెలబస్ ఉంటుంది. మంచిగా ప్రిపేర్ అయితే ఎక్కువ స్కోర్ సాధించే అవకాశం ఉంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.