Home /News /jobs /

TS POLICE JOBS POLICE RECRUITMENT BOARD KEY ANNOUNCEMENT OVER PRELIMINARY WRITTEN TEST NS

Telangana Police Jobs: తెలంగాణ పోలీస్ జాబ్స్ అభ్యర్థులకు అలర్ట్.. ఎగ్జామ్ తేదీలపై బోర్డు అధికారిక ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష (Preliminary Written Test) తేదీలపై పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) తాజాగా కీలక ప్రకటన చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.

    తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు (Telangana Police Jobs) సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 26వ తేదీ రాత్రి 10 గంటలకు ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 7న ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధిచిన ప్రిలిమినరీ ఎగ్జామ్ (Preliminary Written Test) ను నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఇంకా కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆగస్టు 21వ తేదీన ఉండే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అయితే ఖచ్చితమైన తేదీలకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తామని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తెలిపింది. పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ నిన్నటితో ముగిసిన నేపథ్యంలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ రోజు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు? ఏ ఏ పోస్టుకు ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు? ఏ జిల్లాల నుంచి, ఏ వర్గాల నుంచి ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి? తదితర సమగ్ర వివరాలను ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

    మొత్తం 17516 వేల ఖాళీలకు 7,33,559 మంది అభ్యర్థులు 12,91,006 దరఖాస్తులు చేసుకున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వెల్లడించింది. ఇందులో 52 శాతం మంది అభ్యర్థులు కేవలం ఒకే పోస్టుకు అప్లై చేసుకున్నట్లు బోర్డు తెలిపింది. 29 శాతం మంది 2 అప్లికేషన్లు, 15 శాతం మంది 3, 3 శాతం మంది 3. 1 శాతం మంది 5 పోస్టులకు అప్లై చేసుకున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఈ సంఖ్యను పరిశీలిస్తే మెజారిటీ అభ్యర్థులు ఒకే పోస్టుకు అప్లై చేసుకున్నట్లు తెలిపింది. మహిళా అభ్యర్థులు 21 శాతం మంది ఉన్నట్లు బోర్డు తెలిపింది. ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం 2,47,630 దరఖాస్తులు రాగా.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి 9,54,064 దరఖాస్తులు వచ్చాయి.
    Telangana Govt Jobs: తెలంగాణలో డిగ్రీ అర్హతతో మరో జాబ్ నోటిఫికేషన్.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. మెరిట్ ఉంటే ఉద్యోగమే..

    మహిళా అభ్యర్థుల నుంచి 2,76,311 దరఖాస్తులు వచ్చినట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. అభ్యర్థుల రిజర్వేషన్ వారీగా పరిశీలిస్తే SC కేటగిరీకి చెందిన అభ్యర్థుల నుంచి అత్యధికంగా 22.44 శాతం దరఖాస్తులు రాగా.. అత్యల్పంగా బీసీ-సీ కి చెందిన అభ్యర్థుల నుంచి 0.26 శాతం దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మొత్తంగా బీసీ కులాల్లోని అన్ని కేటగిరీలకు చెందిన అభ్యర్థుల నుంచి 41 శాతం దరఖాస్తుల వచ్చాయి.


    ఆ జిల్లాల నుంచి ఎక్కువ దరఖాస్తులు:
    హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల నుంచే 33 శాతం దరఖాస్తులు వచ్చాయని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. అంటే మూడో వంతు దరఖాస్తుల ఆ జిల్లాల నుంచే వచ్చాయి. ఇంకా ములుగు, ఆసిఫాబాద్, భూపాలపల్లి, నారాయణపేట, జనగాం, సిరిసిల్ల జిల్లాల నుంచి అత్యల్ప సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. మొత్తం దరఖాస్తుల్లో ఈ జిల్లాల నుంచి వచ్చిన దరఖాస్తులు కేవలం 7 శాతం మాత్రమే.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Telangana police jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు