Home /News /jobs /

TS POLICE JOBS HERE IS THE PREPARATION TIPS FOR CANDIDATES NS KNR

TS Constable Jobs Tips: తెలంగాణ కానిస్టేబుల్ జాబ్స్ అభ్యర్థులకు అలర్ట్.. ఈ ప్రిపరేషన్ టిప్స్ మీ కోసమే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

కానిస్టేబుల్ జాబ్స్ కు  ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు వచ్చే నెల ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులంతా ప్రిపరేషన్లో మునిగిపోయారు. ఇన్ని రోజులు చదివింది ఒక ఎత్తు ఐతే.. ఇప్పుడు ఉన్న టైం లో చదవడం అనేది మరొక ఎత్తు.

ఇంకా చదవండి ...
    రచయిత, పులి భరత్, సీనియర్ ఫ్యాకల్టీ, కెఎన్ఆర్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ సెంటర్
    (P.Srinivas,New18,Karimnagar)

    కానిస్టేబుల్ జాబ్స్ (TS Constable Jobs) కు  ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు వచ్చే నెల ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులంతా ప్రిపరేషన్లో మునిగిపోయారు. ఇన్ని రోజులు చదివింది ఒక ఎత్తు ఐతే.. ఇప్పుడు ఉన్న టైం లో చదవడం అనేది మరొక ఎత్తు. మరి కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కోసం ఎలా చదవాలి? అనే అంశలపై కెఎన్ఆర్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ సెంటర్ సీనియర్ ఫ్యాకల్టీ పులి భరత్ సార్ సూచనలు సలహాలు అందించారు. అవి ఏంటో ఒకసారి చూద్దాం. కానిస్టేబుల్ జాబ్స్ కు ప్రిపేర్ ఐయ్యే అభ్యర్థులకు ముందుగా ప్రిలిమ్స్, తరువాత ఈవెంట్స్ ఉంటాయి. ఇవి క్వాలిఫై ఐతే మెయిన్స్ ఉంటాయి. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ టోటల్ 200 మార్కులకు ఎగ్జామ్స్ ఉంటుంది. అర్థమెటిక్, రీజనింగ్ కలిపి 100 మార్కులకు ఉంటాయి. ఇంగ్లీష్ 20మార్కులకు ఉంటుంది. తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కరెంట్ అఫైర్స్ మొత్తం కలిపి 80 మార్కులు ఉంటాయి. ఇందులో 60మార్కులు వస్తే కానిస్టేబుల్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. ఇంతవరకు బాగానే ఉంది. మరి 60మార్కులు రావాలంటే 5 తప్పులకు ఒక నెగటివ్ మార్కు ఉంటుంది.

    అభ్యర్థులు జాగ్రత్త గా చూసి ఆన్సర్ లు సెలక్ట్ చేస్తేనే 60మార్కులు సాధించవచ్చు. అప్పుడే ప్రిలిమ్స్ లో మనం విజయం సాధించినవారమవుతాము. క్లాస్ రూంలో విన్న నోట్స్, అలాగే.. ఎక్కువగా మక్ టెస్ట్ లు  రాస్తారో వాళ్లు మంచి స్కోరింగ్ చేసుకోడానికి అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. గతంలో కూడా సేమ్ ఇలానే ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ ఉండేవి. 60మార్కులే కదా చాలా మంది లైట్ గా తీసికుంటే అప్పుడె వేయిల మంది ఫిల్టర్ ఐపోయారు. సో గత ఎగ్జామ్స్ ను గుర్తుపెట్టుకొని పాత మోడల్ పేపర్స్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని సన్నద్ధం కావాలి.
    TS Police Jobs: కానిస్టేబుల్ జాబ్స్ కు ప్రిపేర్ అయ్యే వారికి అలర్ట్.. ఇలా చదివితే జాబ్ పక్కా.. తెలుసుకోండి

    ఈసారి కంపిటేషన్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్ చాలా కఠినంగా ఉండే పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. గతంలో కంటే ఈసారి ఎక్కువ మంది కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. కాబట్టి జాగ్రత్త ఒకటికి రెండు సార్లు ప్రశ్నలను చూసుకొని సమాధానం ఇవ్వాలని అంటున్నారు. నిపుణులు. తొందరపడి సమాధానలు పెడితే అవి తప్పు ఐతే నెగటివ్ మార్కులు ఉంటయి కాబట్టి దెబ్బతినే ప్రమాదం ఉంది.

    అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్..
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: JOBS, Police jobs, Telangana police jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు