Home /News /jobs /

TS POLICE JOBS HERE IS THE PREPARATION TIPS FOR ASPIRANTS NS ADB

TS Police Jobs Preparation Tips: పోలీస్ ఉద్యోగ పరీక్షకు మరికొన్ని రోజులే సమయం.. అభ్యర్థుల కోసం ఈ టిప్స్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పోలీసు కానిస్టేబుల్ పరీక్షకు సిద్దమవుతున్న అభ్యర్థులు పరీక్ష తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో రివిజన్ పై దృష్టి సారించాలని నిపుణులు చెబుతున్నారు.

    రచయిత: అల్లం సాయికృష్ణ, పోటీ పరీక్షల విశ్లేషకులు, ఆదిలాబాద్
    (Lenin, News18, Adilabad)
    పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహిస్తున్న రాత పరీక్ష కు సమయం దగ్గర పడింది. అయితే కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం  సిద్ధమవుతున్న అభ్యర్థులు ఏయే అంశాలపై ప్రధానంగా దృషి సారించాలి? చదివిన విషయాలు గుర్తుండాలంటే ఏమి చేయాలో ఆదిలాబాద్ కు చెందిన పోటీ పరీక్షల విశ్లేషకుడు అల్లం సాయికృష్ణ న్యూస్ 18కు వివరించారు. ఆ వివరాలు ఏమిటో ఇపుడు తెలుసుకుందాం. ఇక ఆగస్టు నెలాఖరులో పరీక్ష ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ప్రిపరేషన్ కంటే రివిజన్ కె ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది. ఇన్ని రోజులు చదివిన విషయాలన్నింటిని రివిజన్ చేసుకోవాలి. ఎంత ఎక్కువ రివిజన్ చేస్తే అంత ఎక్కువగా గుర్తుండే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు చదివిన విషయాలను షార్ట్ కట్ మెథడ్ లో, కోడ్ రూపంలో క్రోడికరించి ఒకటి లేక రెండు పేజీల్లో రాసి సిద్ధంగా ఉంచుకోవాలి. పరీక్షకు ఒకటి రెండు రోజుల ముందు ఈ పేపర్ లోని అంశాలను మరోసారి రివిజన్ చేయాలి.

    ఇప్పటి వరకు ఏయే అంశాలపై పట్టుసాధించారో అవే అంశాలను రివిజన్ చేయాలి తప్ప కొత్త అంశాల జోలికి వెళ్ళకూడదు. ఇక పరీక్ష విషయానికి వస్తే 200 మార్కుల ప్రశ్న పత్రంలో ఎక్కువగా వేయిటేజీ అర్ధమెటిక్, రీజనింగ్ కు ఉంటుంది. ఇందుకు సంబంధించి 50 నుండి 60 బిట్లు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అర్ధమెటిక్, రీజనింగ్, పూర్ మ్యాథ్స్ ఈ మూడు విషయాలను పూర్తిగా రివిజన్ చేయాలి. వీటి తర్వాత వేయిటేజి ఉన్న విషయాలు  తెలంగాణ ఉద్యమం, సమాజం, సంస్క్రతి, కళలు. కనీసం 30 బిట్లు వీటి నుండి రావచ్చు. ఈ సబ్జెక్టును కూడా పూర్తిగా రివిజన్ చేయాలి. తర్వాత జనరల్ సైన్స్ కు సంబంధించి 20 నుండి 25 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

    బయోలజి, ఫిజిక్స్, కెమెస్ట్రి, సైన్స్ అండ్ టెక్నాలజి అంశాలు కూడా కీలకమవుతాయి. గత ప్రశ్న పత్రాలను క్షుణ్ణంగా చదవాలి. అందులో ఏయే చాప్టర్ల నుండి ప్రశ్నలు వచ్చాయో చూసుకొని ఆ చాప్టర్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.  వాటి తర్వాత చరిత్ర, అర్ధశాస్త్రం, పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ తదితర విషయాలపై కూడా దృష్టి పెట్టాలి. వీటీలో ఏయే అంశాలపై పట్టు లభిస్తుందో ఆ విషయాలను మొదటి రివిజన్ చేయాలి. తర్వాత మిగిలిన అంశాలను రివిజన్ చేయాలి.

    ప్రివియస్ ప్రశ్నపత్రాలను క్షుణ్ణంగా గమనించాలి. దీని ద్వారా ఎక్కడ లోపం చేస్తున్నామో తెలుసుకొని ఆ లోపాలను సవరించుకోవచ్చు. తద్వారా ఒక అవగాహన కలుగుతుంది. ఇంగ్లీష్ సబ్జెక్టు పై కూడా దృష్టి సారించాలి. ఇక పరీక్ష రోజు ప్రశ్న పత్రం చేతికి రాగానే వచ్చిన సమాధానాలన్నింటి రాసుకుంటూ పోవాలి. రాని దాని గురించి ఆలోచించుకుంటూ సమయం వృథా చేసుకోవద్దు. వచ్చిన సమాధానాలన్ని రాసిన  తర్వాత రాని ప్రశ్నలను మరోసారి ప్రయ్నత్నించాలి. నెగెటివ్ లోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. అర్హత సాధించడానికి కావాల్సింది 60 మార్కులు సాధించవచ్చు.  ఇలా చేస్తే పరీక్షల్లో విజయం మీ సొంతం అవుతుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Career and Courses, JOBS, Police jobs, Telangana government jobs, Telangana police jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు