Home /News /jobs /

TS POLICE JOBS HERE IS THE IMPORTANT TIPS FOR CONSTABLE ASPIRANTS NS MDK

Constable Jobs Tips: కానిస్టేబుల్ జాబ్స్ కు ప్రిపేర్ అవుతున్నారా? అయితే, ఈ టిప్స్ మీ కోసమే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కు ఎలా చదవాలి? అనే అంశలపై కేఎన్ఆర్ ఇనిస్ట్యిట్యూట్ కోచింగ్ సెంటర్ సీనియర్ ఫ్యాకల్టీ పులి భరత్ సార్ సూచనలు సలహాలు అందించారు. ఆ వివరాలు మీ కోసం..

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    కానిస్టేబుల్ జాబ్స్ (TS Constable Jobs) కు  ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు త్వరలో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి? (Preparation Tips) ఇన్ని రోజులు చదివింది ఒక ఎత్తు ఐతే.. ఇప్పుడు ఉన్న టైం లో చదవడం అనేది మరొక ఎత్తు. మరి కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కు ఎలా చదవాలి? అనే అంశలపై కేఎన్ఆర్ ఇనిస్ట్యిట్యూట్ కోచింగ్ సెంటర్ సీనియర్ ఫ్యాకల్టీ పులి భరత్ సార్ సూచనలు సలహాలు అందించారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ ఐయ్యే అభ్యర్థులకు ముందుగా ప్రిలిమ్స్, తరువాత ఈవెంట్స్, ఇవి క్వాలిఫై ఐతే మెయిన్స్ ఎగ్జామ్ (Exam) ఉంటుంది. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ మొత్తం 200 మార్కులకు ఉంటుంది. అర్థమెటిక్, రీజనింగ్ కలిపి 100 మార్కులు ఇంగ్లీష్ 20మార్కులకు ఉంటుంది. ఇంకా 80 మార్కులకు తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కరెంట్ అఫైర్స్ మొత్తం కలిపి 80 మార్కులకు ఉంటాయి. ఇందులో 60 మార్కులు వస్తే కానిస్టేబుల్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. ఇంతవరకు బాగానే ఉంది. మరి 60మార్కులు రావాలంటే 5 తప్పులకు ఒక నెగటివ్ మార్కులు ఉంటాయి.

    ఈసారి ఇది జాగ్రత్త గా చూసి ఆన్సర్ పెడితేనే 60 మార్కులు సాధించవచ్చు. అప్పుడే ప్రిలిమ్స్ లో మనం ఘన విజయం సాధించవచ్చు. క్లాస్ రూంలో విన్న నోట్స్, అలాగే.. ఎక్కువగా మక్ టెస్ట్ లు రాస్తారో వాళ్లు మంచి స్కోరింగ్ చేసుకోడానికి అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. గతంలో కూడా సేమ్ ఇలానే ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ ఉండేవి. 60మార్కులే కదా చాలా మంది లైట్ గా తీసుకుంటే అప్పుడే వేయిల మంది ఫిల్టర్ అయిపోతారు. సో గత ఎగ్జామ్స్ ను గుర్తుపెట్టుకుని పాత మోడల్ పేపర్స్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని సన్నద్ధం కావాలి.
    TS Constable Jobs: నిరుద్యోగులకు అలర్ట్... తెలంగాణ కానిస్టేబుల్ పరీక్ష వాయిదా



    ఈసారి కంపిటేషన్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్ చాలా కఠినంగా ఉండే పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు భరత్ సార్.  ఎవరైతే ఎక్కువగా మక్ టెస్ట్ లు  రాస్తారో వాళ్లు మంచి స్కోరింగ్ చేసుకోడానికి అవకాశం ఉంటుంది. సో గత ఎగ్జామ్స్ ను గుర్తుపెట్టుకొని పాత మోడల్ పేపర్స్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని సన్నద్ధం కావాలి. ఈసారి కంపిటేషన్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్ చాలా కఠినంగా ఉండే పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Exam Tips, JOBS, Police jobs, Telangana government jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు