తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ పూర్తయింది. తాజాగా ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు గడువును మే 26, 2022 వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్లో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) మొత్తం 16,614 సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం 587 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించి వయోపరిమితిని 30 ఏళ్లకు పెంచారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోవడానికి మరో అవకాశం వచ్చింది.
ఎస్ఐ ఉద్యోగానికి అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి. 2022 జూలై 1 నాటి అర్హతలు ఉండాలి. 31వ నెంబర్ పోస్టుకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఈ లేదా బీటెక్ పాస్ కావాలి. 32వ నెంబర్ పోస్టుకు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పాస్ కావాలి. 33వ నెంబర్ పోస్టుకు కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ పాస్ కావాలి.
పోస్టుల వివరాలు..
మొత్తం ఖాళీలు
587
స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (Civil)
414
స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (AR)
66
స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (SAR CPL) (Men)
05
స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (TSSP) (Men)
23
సబ్ ఇన్స్పెక్టర్ (Men) ఇన్ తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్మెంట్
12
స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్
26
డిప్యూటీ జైలర్ ఇన్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్
8
స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (Information Technology & Communications Organization)
22
స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (Police Transport Organization)
03
స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
8
దరఖాస్తు విధానం..
Step 1 - ముందుగా అధికారిక వెబ్సైట్ https://www.tslprb.in/ లోకి వెళ్లాలి.
Step 2 - కుడి వైపు పైన Apply Online ఆప్షన్ను క్లిక్ చేయాలి.
Step 3 - Have you already Registered ? అని కనిపిస్తుంది. కొత్తగా రిజిస్టర్ చేసుకొనే వారు NO క్లిక్ చేయాలి.
Step 11 - అనంతరం అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.