TS Police Jobs | తెలంగాణలోని నిరుద్యోగులు ఎదురుచూస్తున్న పోలీస్ శాఖకు సంబంధించి 16, 614 పోలీస్ కొలువులకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ సోమవారం నోటిఫికేషన్విడుదల చేసింది. ఈ నేపథ్యంల ఎస్సై సివిల్ పోస్టులకు పోటీ పడేవారిక పరీక్ష విధానం.. సెలబస్ వివరాలు.
తెలంగాణలోని నిరుద్యోగులు ఎదురుచూస్తున్న పోలీస్ శాఖకు సంబంధించి 16, 614 పోలీస్ కొలువులకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ సోమవారం నోటిఫికేషన్విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఎస్ఐ పోస్టులు 587 ఉండగా.. కానిస్టేబుల్పోస్టులు 16,027 ఉన్నాయి. మే 2 నుంచి 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రకటించారు. దరఖాస్తు ప్రక్రియ 2022 మే 2న ప్రారంభం కానుంది. 2022 మే 22 లోగా దరఖాస్తు చేయొచ్చు. ఈ నోటిఫికేషన్లో కానిస్టేబుల్ పోస్టులు 16,027, ఎస్ఐ పోస్టులు 587 ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ఐ పరీక్షకు సంబంధించి పరీక్ష విధానం సెలబస్ గురించి తెలుసుకోండి.
ఎస్ఐ ఉద్యోగానికి అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి. 2022 జూలై 1 నాటి అర్హతలు ఉండాలి. 31వ నెంబర్ పోస్టుకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఈ లేదా బీటెక్ పాస్ కావాలి. 32వ నెంబర్ పోస్టుకు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పాస్ కావాలి. 33వ నెంబర్ పోస్టుకు కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ పాస్ కావాలి.
ప్రిలిమినరీ పరీక్షలో 200 మార్కులు ఉంటాయి. నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ పరీక్షలో అభ్యర్థులు 30శాతం మార్కులు సాధిస్తే ఫిజికల్ ఈవెంట్ కు ఎంపిక అవుతారు.
జనరల్ స్టడీస్
- అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు
- జనరల్ సైన్స్
- భారతదేశ చరిత్ర, సంస్కృతి, భారత జాతీయోద్యమం
- భారత భూగోళశాస్త్రం
- ఇండియన్ పాలిటీ
- భారతదేశ ఆర్థిక వ్యవస్థ
అర్థమెటిక్
- శంకువు (Cone)
- సాపేక్ష వేగాలు
- త్రిభుజాలు
- కరణీయ సంఖ్యలు
- కరణీయ సంఖ్యలు
- సాంఖ్యకశాస్త్రం
- బీజగణితం
- సంఖ్యా వ్యవస్థ
- కొలతలు
- చక్రవడ్డీ
- వృత్త లేదా పైచిత్రాలు
- సంభావ్యత
- శాతాలు
- మిశ్రమాలు
- క్షేత్రగణితం
- సూక్ష్మీకరణలు
- ఘనపరిమాణాలు
- బారువడ్డీ
- లాభనష్టాలు
- క.సా.గు & గ.సా.భా
- కాలం దూరం
- మౌలికాంశాలు
- కాలం పని
- మౌలికాంశాలు
- సరాసరి (సగటు)
- భాగస్వామ్యం
- నిష్పత్తి – అనుపాతం
- వర్గాలు, వర్గమూలాలు
రీజనింగ్& మెంటల్ ఎబిలిటీ
- ఆల్ఫా న్యూమరిక్ సీక్వెన్స్ పజిల్
- పజిల్ టెస్ట్
- సంఖ్య కోడింగ్
- ప్రవచనాలు – తీర్మానాలు
- శ్రేఢులు
- ప్రతిబింబాలు
- పాచికలు
- అక్షరమాల
- కోడింగ్ – డీకోడింగ్
- లాజికల్ వెన్ చిత్రాలు
- జ్యామితీయ చిత్రాలు
- లెటర్ సిరీస్
- సంఖ్యాశ్రేణి
- దిశలు
- గణిత పరిక్రియలు
- క్రమానుగత శ్రేణి పరీక్ష
- మిస్సింగ్ నెంబర్స్
- ప్రతిక్షేపణ పద్ధతి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.