TS POLICE JOBS ALERT FOR CANDIDATES HIGH COMPETITION IN THOSE DISTRICTS IN POLICE RECRUITMENT EVK
TS Police Jobs: అభ్యర్థులకు అలర్ట్.. పోలీస్ రిక్రూట్మెంట్లో ఆ జిల్లాల్లో అధిక పోటీ
(ప్రతీకాత్మక చిత్రం)
TS Police Recruitment 2022 | తెలంగాణ (Telangana) లో యూనిఫాం జాబ్స్ అప్లికేషన్ ప్రాసెస్ (Application Process) ముగిసింది. సీఎం కేసీఆర్ భారీ ఉద్యోగ ప్రకటన చేసిన తరువాత పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) నోటిఫికేషన్ విడుదల చేశాయి. తాజాగా దరఖాస్తు గడువు ముగిసింది.
తెలంగాణ (Telangana) లో యూనిఫాం జాబ్స్ అప్లికేషన్ ప్రాసెస్ (Application Process) ముగిసింది. సీఎం కేసీఆర్ భారీ ఉద్యోగ ప్రకటన చేసిన తరువాత పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) నోటిఫికేషన్ విడుదల చేశాయి. తాజాగా దరఖాస్తు గడువు ముగిసింది. ఈ సారి దరఖాస్తు వివరాల్లో పలు ఆసక్తికర విషయాలు ఉన్నాయి. రాష్ట్రంలో పోలీస్, ఎక్సైజ్, జైళ్లు, రవాణా, అగ్నిమాపకశాఖల్లో మొత్తం 17,516 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడగా.. 7,33,559 అభ్యర్థులు మొత్తంగా 12,91,006 దరఖాస్తులు సమర్పించారు. ఇందులో అత్యధికంగా 51% దరఖాస్తులు బీసీ వర్గాల నుంచి వచ్చాయి.
ఈ సారి పోలీస్ ఉద్యోగాల (Police Jobs) కోసం అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట (Suryapeta) జిల్లాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. మొత్తం దరఖాస్తుల్లో ఆ ఐదు జిల్లాల నుంచే 33% ఉండటం గమనార్హం. అతి తక్కువగా ములుగు, కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నారాయణపేట, జనగామ, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి వచ్చాయి. ఈ జిల్లాలన్నీ కలిపి మొత్తం దరఖాస్తుల్లో కేవలం 7% మాత్రమే ఉన్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి.
వివిధ విభాగాలకు విడివిడిగా దరఖాస్తులు స్వీకరించడంతో పలువురు అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేశారు. దరఖాస్తుదారుల్లో 25 శాతం మంది మహిళలు ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి రోజుకు సగటున 49 వేల మంది చొప్పున దరఖాస్తు చేసుకొన్నట్టు బోర్డు అధికారులు చెప్తున్నారు.
ఎస్సై ప్రిలిమ్స్ ఎప్పుడు ఉండొచ్చు..
తాజాగా యూనిఫాం సర్వీసెస్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ముగిసినందున ప్రిలిమ్స్ పరీక్షల నిర్వహణపై టీఎస్ఎల్పీఆర్బీ అధికారులు దృష్టి సారించారు. ఎస్సై, తత్సమాన ఉద్యోగాలకు ప్రిలిమినరీ రాత పరీక్షను ఆగస్టు 7న కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఆగస్టు 21న ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం కాని ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతానికి ఇవి అంచానా తేదీలు మాత్రమే.
ఆసక్తి చూపిన మహిళా అభ్యర్థులు..
ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి 41% దరఖాస్తులు రాగా, ఓసీ సామాజిక వర్గం నుంచి 7.65% దరఖాస్తులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ర్టాలకు చెందిన అభ్యర్థుల నుంచి 3.48% దరఖాస్తులు వచ్చాయి. మహిళా అభ్యర్థుల నుంచి 2,76,311 దరఖాస్తులు (21%) వచ్చాయి. ఈ నేపథ్యంలో యూనిఫాం ఉద్యోగాలపై మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారని నిపుణులు అంటున్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.