TS Police Jobs 2022 | తెలంగాణ ప్రభుత్వం పోలీస్ రిక్రూట్మెంట్కు సంబంధించి దరఖాస్తు గడువు మే 20, 2022న ముగిసినా దరఖాస్తు తేదీని మే 26, 2022 వరకు పొడగించింది. ఈ నేపథ్యంలో రేపటితో దరఖాస్తు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యవిషయాలు ఉన్నాయి
తెలంగాణ (Telangana)ప్రభుత్వం పోలీస్ రిక్రూట్మెంట్ కు సంబంధించి దరఖాస్తు గడువు మే 20, 2022న ముగిసినా దరఖాస్తు తేదీని మే 26, 2022 వరకు పొడగించింది. ఈ నేపథ్యంలో రేపటితో దరఖాస్తు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యవిషయాలు ఉన్నాయి. దరఖాస్తు చివరి సమయంలో సర్వర్ సమస్యలతో అప్లికేషన్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. గతంలో పోలీస్ రిక్రూట్మెంట్ (Police Recruitment) సమయంలో చివరి గంటల్లో అప్లికేషన్ సబ్మిట్ ఆలస్యం అయ్యింది. దీంతో చాలా మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు అప్రమత్తమై. త్వరగా దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. రేపు మొత్తం దరఖాస్తుకు అవకాశం ఉన్నా.. రేపటి మధ్యాహ్నం లోపు దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకొంటే మంచింది.
తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) ఈసారి మొత్తం 16,614 సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం 587 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించి వయోపరిమితిని 30 ఏళ్లకు పెంచారు.
విద్యార్హతలు ఇవే..
ఎస్ఐ ఉద్యోగానికి అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి. 2022 జూలై 1 నాటి అర్హతలు ఉండాలి. 31వ నెంబర్ పోస్టుకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఈ లేదా బీటెక్ పాస్ కావాలి. 32వ నెంబర్ పోస్టుకు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పాస్ కావాలి. 33వ నెంబర్ పోస్టుకు కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ పాస్ కావాలి.
Step 11 - అనంతరం అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.