తెలంగాణలోని నిరుద్యోగులు ఎదురుచూస్తున్న పోలీస్ శాఖకు సంబంధించి 16, 614 పోలీస్ కొలువులకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ సోమవారం నోటిఫికేషన్విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఎస్ఐ పోస్టులు 587 ఉండగా.. కానిస్టేబుల్పోస్టులు 16,027 ఉన్నాయి. మే 2 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రకటించారు. దరఖాస్తు ప్రక్రియ 2022 మే 2న ప్రారంభం కానుంది. 2022 మే 22 లోగా దరఖాస్తు చేయొచ్చు. ఈ నోటిఫికేషన్‌లో కానిస్టేబుల్ పోస్టులు 16,027, ఎస్ఐ పోస్టులు 587 ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలకు సంబంధించి టైం టేబుల్ను రూపొందించి చదివితే మంచి ఫలితాలు సాధించ వచ్చు.
Jobs in Telangana: ఖమ్మం జిల్లాలో 71 కాంట్రాక్టు ఉద్యోగాలు.. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్
ఎస్ఐ ఉద్యోగానికి అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి. 2022 జూలై 1 నాటి అర్హతలు ఉండాలి. 31వ నెంబర్ పోస్టుకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఈ లేదా బీటెక్ పాస్ కావాలి. 32వ నెంబర్ పోస్టుకు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పాస్ కావాలి. 33వ నెంబర్ పోస్టుకు కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ పాస్ కావాలి.
- ఉదయం 5:00 గంటలకు లేచి మీ రోజును ప్రారంభించండి.
- ఉదయం 5:15 నుంచి 6:15 వరకు- శారీరక వ్యాయామం ఫిజికల్ ఫిట్‌నెస్ ప్రాక్టీస్ చేయండి
- ఉదయం 6:30లోపు కాలకృత్యాలు, స్నానం పూర్తి చేయండి.
- ఉదయం 6:30 నుంచి 7:30 వరకు- ముందు రోజు కవర్ చేసిన అంశాలను రివిజన్ చేసుకోండి.
- ఉదయం 7:30 నుంచి 8:00 వరకు బ్రేక్‌ఫాస్ చేయండి. ఆ తర్వాత వార్తాపత్రిక చదవండి.
- ఉదయం 8:00 నుంచి 10:30 వరకు- అత్యంత సంక్లిష్టమైన టాపిక్స్‌పై అధ్యయనం చేయండి.
- ఉదయం 10:30 నుంచి 11:30 వరకు విశ్రాంతి తీసుకోండి.
- ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు- ఈ రోజు మీరు కవర్ చేయాల్సిన టాపిక్‌పై దృష్టి పెట్టండి.
- మధ్యాహ్నం 1:00 నుంచి 1:00 గంటలకు భోజన విరామం తీసుకోండి.
- మధ్యాహ్నం 1:30. నుంచి 4:00 వరకు రెండు గంటల పాటు చదువుకోండి.
- ఆ తర్వాత 30 నిమిషాలు విశ్రాంతి తీసుకోండి.
- సాయంత్రం 4:00. సాయంత్రం 5:30 వరకు ఫిజికల్ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana government jobs, Telangana police jobs, Ts jobs