హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Police: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పోలీసులు నిర్వహించే ఈ పోటీల్లో పొల్గొనండి.. బహుమతులు గెలుచుకోండి

Telangana Police: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పోలీసులు నిర్వహించే ఈ పోటీల్లో పొల్గొనండి.. బహుమతులు గెలుచుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో ఐదో తరగతి నుంచి డిగ్రీ చేసే విద్యార్థులకు పోలీస్ శాఖ కీలక ప్రకటన చేసింది. పోలీసు అమర వీరుల సందర్భంగా ఆయా విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణలో ఐదో తరగతి నుంచి డిగ్రీ చేసే విద్యార్థులకు పోలీస్ శాఖ (Telangana Police) కీలక ప్రకటన చేసింది. పోలీసు అమర వీరుల సందర్భంగా ఆయా విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులకు (Students) ఆన్లైన్లో నిర్వహించనున్న ఈ పోటీల్లో పాల్గొనాలని సూచించింది. ఈ మేరకు తెలంగాణ పోలీస్ శాఖ ప్రకటన విడుదల చేసింది. విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన ధైర్యవంతులైన పోలీసులను గుర్తుచేసుకుంటూ అక్టోబర్ 21 న పోలీస్ అమరవీరుల దినోత్సవం (Police Flag Day) జరుపుకుంటున్నామని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు తెలంగాణ పోలీస్ నిర్వహించే ఆన్లైన్ వ్యాస రచన పోటీలో ( తెలుగు / ఉర్దూ / ఇంగ్లీషులో) పాల్గొనవలసినదిగా ఆహ్వానిస్తున్నామన్నారు.

2 విభాగాలలో ఈ వ్యాస రచన పోటీలు..

మొదటి విభాగం: 5 తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులు.

వ్యాస రచన అంశం: "రోడ్డు ప్రమాదాలను నివారించడంలో పౌరుల పాత్ర"

రెండవ విభాగం: డిగ్రీ మరియు ఆపై విద్యార్థులకు..

వ్యాస రచన అంశం: "సైబర్ నేరాలను నిరోధించడంలో పౌరులు మరియు పోలీసుల పాత్ర"

Telangana Diwali Holiday Changed: తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. దీపావళి సెలవు మార్పు.. హాలీడే ఎప్పుడంటే?

మీ వ్యాసాన్ని ఆన్లైన్ లో సమర్పించడానికి క్రింది పద్ధతిని (STEPS) అనుసరించండి:

1. సబ్మిట్ చేయటానికి ఈ క్రింది లింకై క్లిక్ చేయండి.

https://forms.gle/y5kk13WkPQYvgfW16

2. తరగతి మరియు ఇతర వివరాలను నమోదు చేయండి.

3.మీ వ్యాసాన్ని పేర్కొన్న ప్రదేశంలో పదాల పరిమితి మించకుండా సమర్పించండి.

4. మీ వ్యాసాన్ని సమర్పించడానికి చివరి తేదీ 24-10-2022

జిల్లా / కమిషనరేట్ ఎంపిక చేసిన ఉత్తమ మూడు వ్యాసాలకు సంబంధిత పోలీసు సూపరింటెండెంట్ / పోలీసు కమీషనర్లు బహుమతి ప్రధానం చేస్తారు. మరియు ఆ వ్యాసాలను సంబంధిత జిల్లా / కమిషనరేట్ అధికారిక సోషల్ మీడియా పేజీలలో పోస్ట్ చేస్తారు.

అన్ని జిల్లా / కమిషనరేట్ల స్థాయిలలో బహుమతులు గెలుపొందిన వ్యాసాలలో నుంచి ఉత్తమ మూడు వ్యాసాలను "రాష్ట్రంలోని మొదటి మూడు ఉత్తమ వ్యాసాలు"గా ఎంపిక చేసి, తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారిక సోషల్ మీడియా పేజీలలో పోస్ట్ చేస్తారు.

-ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రాష్ట్రంలో 5 నుంచి డిగ్రీ చదువుతున్న విద్యార్థులైతే ఈ వ్యాసరచన పోటీల్లో పొల్గొని బహుమతులు అందుకోండి.

ALL THE BEST

First published:

Tags: Career and Courses, JOBS, Telangana Police, Telangana students

ఉత్తమ కథలు