HOME »NEWS »JOBS & EDUCATION »ts pg ecet results 2019 ts pg ecet results released here to check rank cards ra

TS PG ECET 2019: టీఎస్ పీజీ ఈసెట్ 2019 రిజల్ట్స్ రిలీజ్.. ర్యాంకు కార్డులు ఇలా చెక్ చేసుకోండి..

TS PG ECET 2019: టీఎస్ పీజీ ఈసెట్ 2019 రిజల్ట్స్ రిలీజ్.. ర్యాంకు కార్డులు ఇలా చెక్ చేసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం

TS PG ECET 2019 | పీజీ ఈసెట్‌లో 15,664 అంటే 88.27 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అభ్యర్థులు రిజల్ట్స్‌ని pgecet.tsche.ac.in అనే అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఇందులో నుంచే ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

  • Share this:
    రాష్ట్రంలో ఎంటెక్, ఎంఫార్మసీకాలేజీల్లో సీట్ల భర్తీకోసం నిర్వహించిన పీజీ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రిజల్ట్స్‌ని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. పీజీ ఈసెట్‌లో 15,664 అంటే 88.27 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అభ్యర్థులు రిజల్ట్స్‌ని pgecet.tsche.ac.in అనే అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఇందులో నుంచే ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

    ర్యాంకుకార్డుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



    మే 28 నుంచి 31 వరకు నిర్వహించిన పీజీఈసెట్ పరీక్షకు ఈఏడాది దాదాపు 20,415 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 17,722 మంది పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 20 ఆన్‌లైన్ పరీక్షాకేంద్రాల్లో పరీక్షనిర్వహించారు. ఈ ఎగ్జామ్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా తెలంగాణలోని పీజీ కాలేజీల్లో ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎం.ఆర్క్ లాంటి 19 కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.

    ఇవి కూడా చదవండి..

    GOVT Jobs : వైద్య ఆరోగ్యశాఖలో 3,175 పోస్టులు.. భర్తీకి అధికారుల ఏర్పాట్లు..
    Published by:Amala Ravula
    First published:June 20, 2019, 13:07 IST

    टॉप स्टोरीज