• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • TS LAWCET 2019 LAWCET EXAM ON MAY 20TH CHECK HERE DETAILS RA

TS LAWCET : రేపే లాసెట్.. అభ్యర్థులు కచ్చితంగా ఈ నియమాలు పాటించాల్సిందే..

TS LAWCET : రేపే లాసెట్.. అభ్యర్థులు కచ్చితంగా ఈ నియమాలు పాటించాల్సిందే..

ప్రతీకాత్మక చిత్రం

TS LAWCET | మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో4,521సీట్లకు గాను 24,959 మంది అప్లై చేసుకున్నారు. అప్లై చేసే సమయంలో కుల ధ్రువీకరణ పత్రం అప్‌లోడ్ చేయని ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు వాటిని పరీక్షా కేంద్రానికి తీసుకురావాలని సూచించారు అధికారులు.

  • Share this:
    తెలంగాణలోని న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహింసె లాసెట్ -2019 మే 20(సోమవారం)న జరుగనుంది. ఉదయం 11 గంటల నుంచి 1.30 గంటల వరకు జరిగే ఈ పరీక్షకు ఒక్కనిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అనుమతించబోమని అధికారులు తెలిపారు. పరీక్షాకేంద్రంలోకి గంట ముందునుంచే అనుమతిస్తారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలి.

    మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో4,521సీట్లకు గాను 24,959 మంది అప్లై చేసుకున్నారు. అప్లై చేసే సమయంలో కుల ధ్రువీకరణ పత్రం అప్‌లోడ్ చేయని ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు వాటిని పరీక్షా కేంద్రానికి తీసుకురావాలని సూచించారు అధికారులు. ఆన్‌లైన్ విధానంలో ప్రవేశ పరీక్షలు నిర్వహించగా.. ఆ రిజల్ట్స్ జూన్ మొదటివారంలో విడుదలవుతాయి.

    ఇవి కూడా చదవండి..

    AIIMS Jobs : బీబీనగర్‌ ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుకి జూన్ 5 చివరితేదీ..

    రెజ్యూమ్‌లో ఈ పాయింట్స్ కచ్చితంగా పెట్టండి..
    Published by:Amala Ravula
    First published: