TS JOBS MORE GOOD NEWS FOR THE UNEMPLOYED NOTIFICATION IN HEALTH DEPARTMENT WITH 13000 POSTS EVK
Ts Jobs: నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. 13,000 పోస్టులతో ఆ శాఖలో నోటిఫికేషన్
(ప్రతీకాత్మక చిత్రం)
Jobs in Telangana | రాష్ట్రంలో ఇప్పటికే పోలీస్, గ్రూప్-1 నోటిఫికేషన్లు వెలువడ్డాయి. వాటి దరఖాస్తు ప్రక్రియ వేగంగా సాగుతోంది. ప్రిపరేషన్‌కు సంబంధించి పుస్తకాలు మార్కెట్లో అందుబాటులో కూడా ఉన్నాయి. ఈ సమయంలో తాజాగా నిరుద్యోగులకు మరో తీపికబురును మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు.
తెలంగాణలో వరుసగా ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఇప్పటికే, పోలీస్, గ్రూప్-1 నోటిఫికేషన్లు వెలువడ్డాయి. వాటి దరఖాస్తు ప్రక్రియ వేగంగా సాగుతోంది. ప్రిపరేషన్‌కు సంబంధించి పుస్తకాలు మార్కెట్లో అందుబాటులో కూడా ఉన్నాయి. ఈ సమయంలో తాజాగా నిరుద్యోగులకు మరో తీపికబురును మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. వైద్య ఆరోగ్య శాఖ (Health Department) లో భారీగా 13,000 పోస్టులకు నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనున్నట్టు తెలిపారు. అంతే కాకుండా గతంలో ఎన్నడూ లేనంతగా ఆశ వర్కర్ల జీతాలు పెంచామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో వైద్య ఆరోగ్య శాఖకు మెరుగైన కేటాయింపులు చేసినట్టు గుర్తు చేశారు. మంత్రి ప్రకటనతో మరో పెద్ద రిక్రూట్మెంట్కు రంగం సిద్ధం అయినట్టుగా కనిపిస్తుంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.