తెలంగాణ ప్రభుత్వం (Telangana Government Jobs) ఇటీవల భారీగా ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. కోచింగ్ సెంటర్లు భారీగా ఫీజులు వసూలు చేస్తుండడమే ఇందుకు కారణం. దీంతో స్పందించిన అనేక మంది ప్రజా ప్రతినిధులు నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు కోచింగ్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యే గ్రూప్స్ ఉద్యోగాలకు ఎస్సీ అభ్యర్థుల కోసం ఫౌండేషన్ కోర్సు కింద 45 రోజుల నుంచి 60 రోజుల స్వల్ప కాలిక శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. ప్రతీ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే ఒక్కో సెంటర్లో 75-150 మందికి కొచింగ్ ఇస్తామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
ముఖ్యమైన సమాచారం..
- ప్రతీ జిల్లా కేంద్రంలో కోచింగ్ ఉంటుంది.
- ప్రతీ కేంద్రంలో 75 నుంచి 150 మందికి కోచింగ్ అందిస్తారు.
- ఒక్కో అభ్యర్థికి రోజు రూ.75 నుంచి రూ.15,00 విలువైన స్టడీ మెటీరియల్ అందిస్తారు.
అర్హతలు..
- అభ్యర్థులు తప్పనిసరిగా SC అయి ఉండాలి.
ESIC Recruitment 2022: ఈఎస్ఐసీలో 218 ఉద్యోగాలు.. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్
- గ్రూప్స్ ఉద్యోగాలకు సంబంధించి గ్రాడ్యుయేషన్, కానిస్టేబుల్ ఖాళీలకు ఇంటర్ చేసి ఉండాలి.
- పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి శరీర దారుఢ్య పరీక్షలకు సంబంధించిన అర్హతలు ఉండాలి.
Wipro Jobs: విప్రో హైదారబాద్ లోకేషన్లో జాబ్ ఓపెనింగ్స్.. అర్హతలు, అప్లికేషన్ విధానం
- అభ్యర్థుల వార్షికాదాయం 2 లక్షలలోపు ఉండాలి.
- ప్రస్తుతం వివిధ కోర్సులకు సంబంధించిన విద్యను అభ్యసిస్తున్న వారు కోచింగ్ కు అనర్హులు.
- వివిధ స్టడీ సర్కిల్స్ ద్వారా కోచింగ్ పొందుతున్న వారు కూడా అనర్హులు.
- కేవలం తెలంగాణకు చెందిన వారు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు: ఏప్రిల్ 9, 2022 నుంచి ఏప్రిల్ 18, 2022 వరకు
అడ్మిషన్లు ఏప్రిల్ 22, 2022న ఇస్తారు.. క్లాస్లు ఏప్రిల్ 25, 2022 నుంచి ప్రారంభం అవుతాయి.
దరఖాస్తు విధానం..
Step 1: అభ్యర్థులు మొదటగా http://tsstudycircle.co.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం హోం పేజీలో మీరు కోచింగ్ తీసుకోవాలనుకొంటున్న పోస్టులకు సంబంధించి Apply Online ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Online Exams: ఆన్లైన్ పరీక్షలపై సందేహాలా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
Step 3: అక్కడ పేరు, ఆధార్, విద్యార్హతల వివరాలను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
Step 4: అభ్యర్థులు అప్లై చేసే సమయంలో ఫొటో, సంతకం, టెన్త్ మార్కులు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డ్ ను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
Step 5: దరఖాస్తు పూర్తయిన తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Preparation, Study center, Telangana government jobs, Ts jobs