Home /News /jobs /

TS JOBS CHANCE FOR JOBS IN THAT DEPARTMENT ON WEEKDAYS APPLICATION PROCEDURE THINGS TO KEEP IN MIND EVK

TS Jobs: ఆ శాఖ‌లో ఉద్యోగాల‌కు వారం రోజులే చాన్స్‌.. ద‌ర‌ఖాస్తు విధానం.. గుర్తుంచుకోవాల్సిన అంశాలు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Excise Constable | ఎక్సైజ్ శాఖ‌లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తులు ప్రారంభం అయ్యాయి. ఈ ఎంపిక ప్ర‌క్రియ‌లో 614 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. దీనికి సంబంధించిన అప్లికేష‌న్ ప్రాసెస్ వివ‌రాలు తెలుసుకోండి

ఇంకా చదవండి ...
    Excise Constable | ఎక్సైజ్ శాఖ‌లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తులు ప్రారంభం అయ్యాయి. ఈ ఎంపిక ప్ర‌క్రియ‌లో 614 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. దీనికి సంబంధించిన అప్లికేష‌న్ ప్రాసెస్ వివ‌రాలు తెలుసుకోండి. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి https://www.tslprb.in/ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాలి. ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలో తెలుసుకోండి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2022 మే 2న ప్రారంభ‌మై.. 2022 మే 22 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

    TSSPDCL Recruitment 2022: జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాలకు ద‌ర‌ఖాస్తు చేస్తున్నారా.. జిల్లాల వారీగా ఖాళీల వివ‌రాలు

    అర్హ‌త‌లు..

    - విద్యార్హ‌త ఇంట‌ర్మీడియ‌ట్‌..

    - జూలై 1, 2022 నాటికి 18 ఏళ్లు నిండి 22 ఏళ్లు దాట‌కుండా ఉండాలి. 2000 జూలై 2, కంటే ముందు పుట్టి ఉండ‌కూడ‌దు. జూలై 1, 2004 త‌ర్వాత పుట్టి ఉండ‌కూడ‌దు.

    Study Tips: ఎక్కువ సేపు చ‌దువ‌లేక‌పోతున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

    - రెండేళ్ల కాలంలో 365 రోజులు విధులు నిర్వ‌ర్తించి, ఇప్ప‌టికీ కొన‌సాగుతున్న హోంగార్డులైతే 18 ఏళ్ల వ‌య‌సు నిండి 40 ఏళ్లు దాట‌కూడ‌దు.

    ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1 - ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.tslprb.in/ లోకి వెళ్లాలి.

    Step 2 - కుడి వైపు పైన Apply Online ఆప్ష‌న్‌ను క్లిక్ చేయాలి.

    TSPCDL Recruitment 2022: నిరుద్యోగుల‌కు అల‌ర్ట్‌.. విద్యుత్ శాఖ నుంచి 201 పోస్టుల‌కు మ‌రో నోటిఫికేష‌న్ వివ‌రాలు!

    Step 3 - Have you already Registered ? అని క‌నిపిస్తుంది. కొత్తగా రిజిస్ట‌ర్ చేసుకొనే వారు NO క్లిక్ చేయాలి.

    Step 4 - అనంత‌రం రిజిస్ట్రేష‌న్‌కు సంబంధించిన స‌మాచారం క‌నిపిస్తుంది.

    Step 5 - పేరు, పుట్టిన తేదీ, క‌మ్యూనిటీ, మొబైల్ నంబ‌ర్‌, ఈమెయిల్ ఐడీ ఇచ్చి స‌బ్‌మిట్ చేయాలి. ఇవి ఒక్క‌సారి ఇస్తే మార‌వు.

    Step 6 - అనంత‌రం మొబైల్, ఈమెయిల్‌కు ఓటీఈ వ‌స్తుంది. అది స‌బ్‌మిట్ చేసి ధ్రువీక‌రించుకోవాలి.

    Step 7 - త‌రువాత మొబైల్ నంబ‌ర్, పాస్‌వ‌ర్డ్ సెట్ చేసుకొని సైన్ ఇన్ కావాలి.

    Step 8 - త‌రువాత మీరు ఏ విభాగాన్ని ఎంచుకొంటున్నారో క్లిక్ చేయాలి. SCT PC Civil and / or Equivalent సెలెక్ట్ చేసుకోవాలి.

    Step 9 - అనంత‌రం ఫీజు చెల్లించాలి.

    Jobs in AP: విశాఖ‌ప‌ట్నంలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. వేతనం రూ.28,000.. అర్హతల వివరాలు

    Step 10 - త‌రువాత విద్యా, కుటుంబ‌, క‌మ్యూనిటీ, అడ్ర‌స్ వివ‌రాలును త‌ప్పులు లేకుండా నింపాలి.

    Step 11 - అనంత‌రం అప్లికేష‌న్ స‌బ్‌మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Govt Jobs 2022, Job notification, JOBS, Jobs in telangana, Ts jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు