Home /News /jobs /

TS JOBS ALERT FOR THOSE PREPARING FOR GOVERNMENT JOBS SPECIAL APP LAUNCH DOWNLOAD KNR EVK

Govt Jobs Preparation App: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారి అలర్ట్.. ప్రత్యేక యాప్ ఆవిష్కరణ.. డౌన్లోడ్ చేసుకోండిలా..

యాప్ ను ఆవిష్కరిస్తున్న అధికారులు

యాప్ ను ఆవిష్కరిస్తున్న అధికారులు

Govt Job Preparation App | ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు  సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత కోసం వారధి మొబైల్ యాప్ (Mobile App) ను కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్ వీ. కర్ణన్  ఆవిష్కరించారు.  కరీంనగర్ జిల్లా తో పాటు  తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఈ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు

ఇంకా చదవండి ...
    ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు  సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత కోసం వారధి మొబైల్ యాప్ (Mobile App) ను కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్ వీ. కర్ణన్  ఆవిష్కరించారు.  కరీంనగర్ జిల్లా తో పాటు  తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఈ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.  ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు  సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత కోసం వారధి మొబైల్ యాప్ కరీంనగర్ ఐటీ హబ్ ఆధ్వర్యంలో రూపొందించడం జరిగిందని, గ్రూప్ 1,2 పోటీ పరీక్షలకు హాజరయ్యే  వారు ఈ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.

    TSPSC Group-1: గ్రూప్‌-1 అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. ప్రిలిమ్స్ ఎంపిక విధానంలో మార్పులు.. పూర్తి వివరాలు

    మెటీరియల్, ప్రశ్నాపత్రాలు..

    కరీంనగర్ (Karimnagar) ఐటి హబ్  టవర్ లో టీమ్ -అప్ సంస్థ అధినేత ఎం. కె. చైతన్య, స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంకతో కలసి "వారధి సొసైటీ మొబైల్ యాప్" ను జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఐ.టి. రంగ విస్తీర్ణంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం Tier-ll సిటీ లలో కూడా ఐ.టి. ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో కరీంనగర్ లో ఐటీ  టవర్ ని నెలకొల్పడం జరిగిందని అన్నారు.  కరీంనగర్ పట్టణంలో మొట్టమొదటి సారిగా టీం-అప్ సంస్థ ద్వారా రూపొందించిన యాప్ లో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల ఉపయోగార్థం మాక్ టెస్ట్, స్టడీ మెటీరీయల్స్,గత మాదిరి ప్రశ్న పత్రాలు,పలు రకాల ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయని అన్నారు.

    TS Police Recruitment: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. వారిని ప‌ట్టిస్తే రూ.లక్ష బహుమతి

    ఉద్యోగార్థులకు ఈ అవకాశాన్ని ఉచితంగా అందించడం జరుగుతుందని అన్నారు. ఈ యాప్ ను కరీంనగర్ జిల్లా వాస్తవ్యులే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.  టీం-అప్ (T-App) సంస్థ సీఈఓ  ఎం.కే.చైతన్య మాట్లాడుతూ స్థానిక నిరుద్యోగులను ప్రోత్సహించుటకు వారధి సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల ఉపయోగార్థం మొబైల్ అప్లికేషన్ అప్ రూపొందించడం జరిగిందని అన్నారు. ఈ యాప్ యొక్క సేవలను పొందడానికి ఫోన్ నెంబర్, ఓటిపితో లాగిన్ అవ్వాలని అన్నారు.

    Govt Jobs 2022: ఈ వారం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిన గ‌వ‌ర్న‌మెంట్‌ జాబ్స్‌.. అర్హ‌త‌లు, ద‌ర‌ఖాస్తు విధానం

    ఒకవేళ ఇంతకు ముందు వారథిలో మెంబర్ అయినట్లైతే వారి వారధి అకౌంట్లో లాగిన అవ్వాలని అన్నారు.  https://play.google.com/store/apps/details?id=com.teamup.varadhi ఈ యాప్ ను ప్లే స్టోర్ నుండి వారధి అని టైప్ చేసి డౌన్ లోడ్ చేసుకోవాలని అన్నారు. యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఇందులో ఉన్న సమాచారాన్ని  ప్రతిరోజు ఫాలో అయినట్లైతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేరయ్యే అభ్యర్థులు ఈ సమాచారాన్ని పక్కాగా చదివినట్లయితే తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చునని వారు తెలిపారు.

    IIT Hyderabad Recruitment: ఐఐటీ హైద‌రాబాద్‌లో రీసెర్చ్ ఫెలో జాబ్స్‌.. వేత‌నం నెల‌కు రూ.42,000.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ వివ‌రాలు

    తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా ఈ యాప్ ను కరీంనగర్లో ప్రవేశపెట్టడం..చాలా సంతోషంగా ఉందని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు.అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కూడా అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంక, టీం- అప్ సంస్థ కో-ఫౌండర్ ఏ. రంజిత్, వారధి సెక్రటరీ ఆంజనేయులు, మరియు టీం అప్ సంస్థ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

    - పి. శ్రీ‌నివాస్‌, న్యూస్ 18 తెలుగు, క‌రీంన‌గ‌ర్‌

    Published by:Sharath Chandra
    First published:

    Tags: Govt Jobs 2022, Preparation, Telangana jobs, TSPSC

    తదుపరి వార్తలు