TS JOB COACHING GOOD NEWS FOR THE UNEMPLOYED FREE GOVERNMENT JOBS TRAINING NLG NJ EVK
Ts Job Coaching: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉచితంగా ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ
(ప్రతీకాత్మక చిత్రం)
TS Govt Job Preparation | తెలంగాణలోఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పెద్ద ఎత్తున నోటిఫికేషన్ విడుదల చేయడంతో విద్యార్థులు కోచింగ్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 80 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు మొదలెట్టింది. ఈ నేపథ్యంలో నల్గొండలో ఉద్యోగార్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు.
తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పెద్ద ఎత్తున నోటిఫికేషన్ విడుదల చేయడంతో విద్యార్థులు కోచింగ్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 80 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు మొదలెట్టింది. ఇదే అదనుగా కోచింగ్ సెంటర్లు భారీగా ఫీజుల పెంచేశాయి. దీంతో నిరుపేద విద్యార్థులకు అండగానిలిచేందుకుపోలీస్శాఖ, స్థానికఎమ్మెల్యేలు, స్వచ్ఛందసంస్థలు ముందుకొచ్చాయి. నల్గొండ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఉచిత శిక్షణ కేంద్రాన్ని (Free coaching center) ఏర్పాటు చేశారు. మెరిట్ ఆధారంగా 600 మంది విద్యార్థులను ఎంపిక చేసి శిక్షణ అందిస్తున్నారు.
జిల్లా ఎస్పీ రెమారాజేశ్వరి సైతం ప్రతిభావంతులైన విద్యార్థులకు నెల రోజులపాటు పోలీస్ శిక్షణ కేంద్రంలో తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఉన్నా వేలకు వేలు పెట్టి కోచింగ్ తీసుకోలేని విద్యార్థులకు ఈ ఫ్రీ కోచింగ్ సెంటర్ చాలా ఉపయోగపడుతోంది. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్ననిరుద్యోగులు మాట్లాడుతూ.. మెరిట్ ఆధారంగా యువతను ఎంపిక చేశారని తెలిపారు. శిక్షణలో భాగంగా హైదరాబాద్ నుంచి అనుభవజ్ఞులైన బోధన సిబ్బంది, అర్థమయ్యేరీతిలో క్లాస్‌లు చెప్తున్నారని విద్యార్థులు (students) ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
శిక్షణ శిబిరంలో మౌలిక సదుపాయాలు (facilities) ఏర్పాటు చేశారనీ చెప్పారు. విద్యార్థులకు అవసరమైన స్టడీమెటీరియల్కు ఉచితంగానే ఇస్తున్నారు. ప్రతిరోజూ (daily) రెండు సబ్జెక్టులనుబోధిస్తున్నారు. మలాంటి గ్రామీణ నిరుపేద యువతి యువకులకు ఉచిత కోచింగ్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని అభ్యర్థులు చెబుతున్నారు.
ఉచిత కోచింగ్ సెంటర్లను వలన ఎంతో మంది విద్యార్థులకు.. సబ్జెక్ట్‌పై పట్టు సాధించేందుకు వీలుంటుందంటున్నారు. కోచింగ్ ఇస్తున్న వాళ్లు ఏమైనాడౌట్స్ వస్తే.. ఉపాధ్యాయులు దగ్గరుండి క్లియర్చేస్తున్నారు. విద్యార్థులు మరింత సాధన చేసే విధంగా ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే కేవలం పరీక్షలు రాయడమే కాదు.. మానసికంగా కూడా ధృఢంగా ఉండాలి. అందుకు అప్పుడప్పుడు విద్యార్థుల్లో ధైర్యం, ఆత్మస్థైర్యాన్నినింపేలా స్పెషల్ క్లాసెస్ కూడా ఇస్తున్నారు.
జాబ్ కొట్టాలని పట్టుదలగా ఉన్నఎంతో మంది యువతకు ఈ ఉచిత కోచింగ్ సెంటర్ నుంచి వేదికని నిరుద్యోగ యువత స్పష్టం చేసింది.
- నాగరాజు, న్యూస్18 తెలుగు, నల్గొండ
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.