హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల... చెక్ చేయండిలా

TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల... చెక్ చేయండిలా

TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల... చెక్ చేయండిలా
(ప్రతీకాత్మక చిత్రం)

TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల... చెక్ చేయండిలా (ప్రతీకాత్మక చిత్రం)

TS Inter Results 2022 | తెలంగాణ ఇంటర్ బోర్డు ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను (TS Inter Supplementary Results) విడుదల చేసింది. ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Warangal

తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు (TS Intermediate Supplementary Results 2022) వచ్చేశాయి. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ రిజల్ట్స్‌ని విడుదల చేసింది. ఆగస్ట్ 1 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ విడుదల చేశారు. ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్‍‌ను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం సెకండియర్ సప్లిమెంటరీ ఫలితాలను మాత్రమే విడుదల చేసింది ఇంటర్ బోర్డు. ఈ పరీక్షలకు 1.13 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారని అంచనా. ఫలితాలు ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.


తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు చెక్ చేయండిలా


Step 1- విద్యార్థులు తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in ఓపెన్ చేయాలి.


Step 2- హోమ్ పేజీలో ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ ఫలితాల లింక్ పైన క్లిక్ చేయాలి.


Step 3- హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి.


Step 4- ఫలితాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి.


Step 5- ప్రింట్ తీసుకొని PDF ఫార్మాట్‌లో సేవ్ చేసుకోవాలి.


Jobs in Flipkart: ఫ్లిప్ కార్ట్ లో జాబ్స్.. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో రూ.40 వేల వరకు వేతనం.. ఇలా రిజిస్టర్ చేసుకోండితెలంగాణలో మే 26 నుంచి మే 24 వరకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు జరిగాయి. 4.64 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్, 4.39 మంది విద్యార్థులు ఇంటర్ సెకండియర్ పరీక్షల్ని రాశారు. జూన్ 28న ఫలితాలు విడుదలయ్యాయి. ఫెయిల్ అయిన విద్యార్థులకు, ఇంప్రూవ్‌మెంట్ రాయాలనుకునే స్టూడెంట్స్‌కు మరో ఛాన్స్ ఇస్తూ ఆగస్ట్ 1 నుంచి సప్లిమెంటరీ పరీక్షల్ని నిర్వహించింది ఇంటర్ బోర్డు.

First published:

Tags: Telangana results, TS Inter Exams 2022, TS Inter Results 2022

ఉత్తమ కథలు