TS Inter Exams : ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వాయిదా..

TS Inter Exams | తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. రీవెరిఫికేషన్ రిజల్ట్స్ దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటన చేసింది.

Amala Ravula | news18-telugu
Updated: April 28, 2019, 5:49 PM IST
TS Inter Exams : ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వాయిదా..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: April 28, 2019, 5:49 PM IST
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ దుమారం రేగింది. ఫెయిల్ అయిన విద్యార్థులకి రీవెరిఫికేషన్ ఉచితంగా ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఈ సమయంలోనే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ టైమ్ టేబుల్‌ని విడుదల చేశారు. మే 16 నుంచి ఎగ్జామ్స్ జరుగనున్నాయంటూ వెల్లడించారు. ఏప్రిల్ 27తో సప్లిమెంటరీ దరఖాస్తు కూడా ముగిసింది. అయితే ఇప్పుడు ఈ పరీక్షలను మే 16 నుంచి మే 25కి వాయిదా వేశారు అధికారులు. మే 25 నుంచి జూన్ 4 వరకూ పరీక్షలు నిర్వహిస్తామని.. అదే విధంగా జూన్ 7 నుంచి 10వ తేదీ వరకూ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరుగుతాయని ఇంటర్ బోర్డు వెల్లడించింది.

ప్రస్తుతం ఫెయిలైన విద్యార్థుల రీవెరిఫికేషన్ జరుగుతోంది. ఈ రిజల్ట్స్ రావడానికి కనీసం 15 రోజుల టైమ్ పడుతుంది. అందుకే సప్లిమెంటరీ పరీక్షల తేదీలను వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు.

First published: April 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...