తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. నాలుగున్నర లక్షల మంది ఇంటర్ సెకండియర్ విద్యార్థుల ఉత్కంఠకు తెరపడింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేసింది తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్-TSBIE. ఇంటర్ సెకండియర్ విద్యార్థులు తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ https://tsbie.cgg.gov.in/ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత సెకండియర్ రిజల్ట్స్ లింక్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత సెకండియర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. ఎగ్జామ్ ఫీజు కట్టిన 4,51,545 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. వీరిలో బాలికలు 2,28,754 ఉండగా బాలురు 2,22,831 ఉన్నారు. మొత్తం విద్యార్థుల్లో 1,04,886 మంది విద్యార్థులు గ్రేడ్-ఏతో పాస్ అయ్యారు. ఇక 61,887 విద్యార్థులకు గ్రేడ్ బీ, 1,08,093 మంది విద్యార్థులకు గ్రేడ్ సీ వచ్చాయి. సెకండ్ ఇయర్ విద్యార్థులకు వచ్చిన మార్కులు నచ్చకపోతే పరీక్ష రాయొచ్చు. వారికి ఆప్షనల్ ఎగ్జామ్ నిర్వహించనుంది ప్రభుత్వం.
ఇంటర్ విద్యార్థులు సెకండియర్ హాల్‌టికెట్ నెంబర్ తెలుసుకోవడానికి ఇంటర్ బోర్డు ప్రత్యేక లింక్ క్రియేట్ చేసింది. విద్యార్థులు https://tsbie.cgg.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజీలో CLICK HERE TO KNOW YOUR INTER SECOND YEAR HALLTICKET NO పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో రోల్ నెంబర్ లేదా గతంలోని హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి. Get Student Details పైన క్లిక్ చేస్తే ఇంటర్ సెకండియర్ హాల్ టికెట్ నెంబర్ తెలుస్తుంది.
కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రద్దయ్యాయి. అయితే సెకండ్ ఇయర్ విద్యార్థులకు మార్కులు ఎలా వేయాలన్నదానిపై తెలంగాణ విద్యా శాఖ కసరత్తు చేసి గైడ్‌లైన్స్ రూపొందించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వచ్చిన మార్కులనే పరిగణలోకి తీసుకొని సెకండియర్ మార్కుల్ని వేసింది ఇంటర్ బోర్డు. మొదటి సంవత్సరంలో ఎన్ని మార్కులు వచ్చాయో సెకండ్ ఇయర్లో కూడా అన్ని మార్కులే వస్తాయి. ప్రాక్టికల్స్‌లో 100 శాతం మార్కుల్ని కేటాయించారు. ఫస్ట్ ఇయర్లో బ్యాక్‌లాగ్స్ ఉన్నవారు అంటే కొన్ని సబ్డెక్ట్స్లో ఫెయిల్ అయినవారిని 35 శాతం మార్కులతో పాస్ చేసింది తెలంగాణ విద్యా శాఖ. బ్యాక్ లాగ్స్ ఫీజు చెల్లించినవారందరినీ 35 శాతం మార్కులతో పాస్ చేసింది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.