TS Inter Results : తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ ఇప్పట్లో లేనట్లేనా.. జవాబు పత్రాలు మిస్సింగ్ అయ్యాయా..?

TS Inter Results | తెలంగాణలో ఎప్పుడెప్పుడు ఇంటర్ రిజల్ట్స్ అని ఎదురుచూస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకి షాకింగ్ న్యూస్. ఇంటర్ విద్యార్థుల జవాబు పత్రాలు గల్లంతైనట్లు వార్తలు వచ్చాయి.

news18-telugu
Updated: April 15, 2019, 8:54 AM IST
TS Inter Results : తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ ఇప్పట్లో లేనట్లేనా.. జవాబు పత్రాలు మిస్సింగ్ అయ్యాయా..?
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 15, 2019, 8:54 AM IST
తెలంగాణలో ఇంటర్ రిజల్ట్స్ ఈ తేదీన అంటూ రోజుకో వార్త వస్తున్న తరుణంలో మరో పిడుగులాంటి వార్త బయటికొచ్చింది. ఇంటర్ విద్యార్థుల జవాబుపత్రాలు మిస్సింగ్ అయినట్లు ‘ఆంధ్రప్రభ’ పత్రికలో న్యూస్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్నట్లైంది. పరీక్షల అనంతరం వాల్యూయేషన్‌ కోసం తరలిస్తుండగా ఆన్సర్ షీట్స్ మిస్ అయ్యాయని, వీటిని వెతికే పనిలో అధికారులున్నట్లు కథనాన్ని ప్రచురించింది ‘ఆంధ్రప్రభ’ పత్రిక. మిస్ అయిన ఆన్సర్ షీట్స్ దొరికిన తర్వాతే రిజల్ట్స్ వస్తాయని.. లేదంటే ఇంకా ఆలస్యం అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
కొన్ని రోజుల క్రితమే ఇంటర్ ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. ఫస్టియర్, సెకండియర్ మొత్తం కలిపి 10 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. బోర్డు నిబంధనల ప్రకారం 12 వాల్యూయేషన్ సెంటర్స్‌కి ఆన్సర్ సీట్స్‌ని పంపించారు. ఆదిలాబాద్, వరంగల్‌తో పాటు మరికొన్ని కేంద్రాలకు చేరిన పత్రాలు.. అక్కడ్నుంచి ఇతర కేంద్రాలకు పంపే సమయంలో అవి దారి మళ్లాయని వాటిని వెతికే పనిలో అధికారులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వాల్యూయేషన్ సెంటర్‌లో సబ్జెక్టుకి సంబంధించిన అధ్యాపకులు లేకపోవడంతో వాటిని తిరిగి ఆ సబ్జెక్ట్ వాల్యూయేషన్ చేసే కేంద్రాలకు పంపించే దారిలో ఆన్సర్ షీట్స్ మిస్ అయినట్లు.. వీటిని అధికారులు ఆలస్యంగా గుర్తించినట్లు వార్తను ప్రచురించింది. ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా ఇంటర్ బోర్డు అధికారులు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారు.
జేఎన్టీయూ పర్యవేక్షణలో నడుస్తున్న ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం ఒక్కో అధ్యాపకుడు ఉదయం, మధ్యాహ్నం కలిపి 30 ఆన్సర్ షీట్స్ వాల్యూయేషన్ చేయాలి. అయితే, ఈ ఏడాది మాత్రం దీనికి రెట్టింపుగా ఒక్కొక్క అధ్యాపకుడు 50 నుంచి 60 జవాబు పత్రాలు వాల్యూయేషన్ చేస్తున్నట్లు సమాచారమందింది. దీనివల్ల అధ్యాపకులపై అదనపు భారంపడుతుంది.. ఆ ఫలితం ఇంటర్ రిజల్ట్స్‌పై ప్రభావం చూపుతుంది. ఈ సమస్యలన్నీ కూడా ఇంటర్ బోర్డు తప్పిదాలుగా తెలుస్తోంది. ఓవైపు ఎంసెట్ ర్యాంకుల నిర్ధారణకు ఇంటర్ రిజల్ట్స్‌ని 25శాతం పరిగణనలోకి తీసుకుంటున్న సమయంలో ఇలాంటి అవకతవకలు, విద్యార్థుల శాపంగా పరిణమించాయి. ఇప్పటికే ఏపీలో ఇంటర్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఈ ఇబ్బందులన్నింటి కారణంగా ఈ నెల 20 తర్వాతే ఫలితాల ప్రకటన ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది ఇంటర్ బోర్డు మరీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని.. ప్రవేశాలు మొదలుకుని ఫలితాల ప్రకటనల వరకూ అన్నీ విషయాల్లో తప్పులు ఉన్నాయని, ముఖ్యంగా పరీక్షల వ్యవహారాలు పర్యవేక్షణ ఓ సాఫ్ట్‌వేర్ సంస్థకు అప్పగించడం వల్ల ఫీజు చెల్లింపు, హాల్‌టికెట్లలో తప్పులు ఇలా ప్రతీ ఒక్క విషయంలోనూ లోపాలు జరిగాయని వార్తలు వస్తున్నాయి...

ఇన్ని గందరగోళాల మధ్య ఫలితాలు ఎప్పుడు విడుదల అవుతాయోనని విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి..



Govt Jobs : UPSC లో ఉద్యోగాలు.. జీతం రూ. 47,600/-

 
First published: April 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...