TS Inter Results : సీజీజీ, జేఎన్‌టీయూలకు ఇంటర్ రిజల్ట్స్ బాధ్యత..

TS Inter Results | ఇంటర్ జవాబు పత్రాల పున:పరిశీలన అనంతరం రిజల్ట్స్ అనౌన్స్‌మెంట్ ప్రక్రియను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ), జేఎన్‌టీయూహెచ్‌‌లు పర్యవేక్షించనున్నాయి.

news18-telugu
Updated: May 5, 2019, 10:48 AM IST
TS Inter Results : సీజీజీ, జేఎన్‌టీయూలకు ఇంటర్ రిజల్ట్స్ బాధ్యత..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 5, 2019, 10:48 AM IST
తెలంగాణలో దుమారం రేపిన ఇంటర్మీడియెట్ విషయంలో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇంటర్ జవాబుపత్రాల పున:పరిశీలన అనంతరం రిజల్ట్స్ అనౌన్స్‌మెంట్ ప్రక్రియను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ), జేఎన్‌‌టీయూహెచ్‌లు పర్యవేక్షించనున్నాయి. ఇప్పటికే వీటిపై విచారణ జరిపిన త్రిసభ్య కమిటీ రిజల్ట్స్ ప్రాసెసింగ్‌ని గ్లోబరీనా టెక్నాలజీస్‌తో పాటు దానికి సమాంతరంగా మరో సంస్థకు కూడా అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే నోయిడాకు చెందిన డేటా టెక్ మెథడెక్స్ అనే సంస్థను తెలంగాణ రాష్ట్ర సాంకేతిక సేవలు(టీఎస్‌టీఎస్) ఎంపిక చేసింది.

ప్రస్తుతం గ్లోబరీనా, మెథడెక్స్ సంస్థలు వేర్వేరుగా ఫలితాల ప్రాసెసింగ్ చేపడతాయని ఆ రెండు ఫలితాలను ప్రాసెసింగ్ చేపడతాయని, ఆ రెండు పలితాలను సరిపోల్చుకుని ఖచ్చితంగా వచ్చాయని నిర్ధారించుకున్న తర్వాతే ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. అదేవిధంగా ఆ రెండు సంస్థల ఫలితాల విశ్లేషణ సీజీజీ, జేఎన్‌టీయూహెచ్ పర్యవేక్షణలో జరుగనుందని ఆయన తెలిపారు.

ఫలితాల ప్రకటన విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని కోరారు.

ఇవి కూడా చదవండి..



Govt Jobs : పదోతరగతి అర్హతతోనే బోర్డర్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలు
First published: May 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...