TS Inter Results : తెలంగాణలో ఇంటర్ రిజల్ట్స్ ఎప్పుడంటే..

తెలంగాణలో ఇంటర్ రిజల్ట్స్ కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఏపీలో ఇంటర్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. అయితే, తెలంగాణలో అధికారులు ఇంకా ఏ విషయం వెల్లడించకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

Amala Ravula | news18-telugu
Updated: April 13, 2019, 10:28 AM IST
TS Inter Results : తెలంగాణలో ఇంటర్ రిజల్ట్స్ ఎప్పుడంటే..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: April 13, 2019, 10:28 AM IST
తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్‌పై సందిగ్ధత నెలకొంది. గతంలో రకరకాల తేదీలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వార్తలను ఖండించలేదు అధికారులు. పైగా రిజల్ట్స్‌పై ఇప్పటివరకూ ఇంటర్ బోర్డు నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో రిజల్ట్స్ కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఏపీలో రిజల్ట్స్ వచ్చేశాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఒకేసారి పరీక్షలు జరిగాయి. మార్చి 18న తెలంగాణలో పరీక్షలు పూర్తయ్యాయి. మూల్యంకనం కూడా ఏప్రిల్ 5నే పూర్తైంది.
అయినా.. ఫలితాలు ప్రకటించలేదు. సాంకేతిక సమస్యలే ఫలితాలు ప్రకటించకపోవడానికి ప్రధానకారణమని తెలుస్తోంది.
ఈ సమస్యలను త్వరగా తీర్చి త్వరలోనే రిజల్ట్స్‌ని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు అధికారులు. కాస్తా ఆలస్యమైనా సరే..ఎలాంటి తప్పులు జరగకుండా ఫలితాలు విడుదల చేయాలనే ఉద్దేశ్యంతోనే సమయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల మూడోవారంలో విడుదల చేయనున్నట్లు చెబుతున్నారు. అయితే.. ఇదే విషయంపై ఓ స్పష్టమైన ప్రకటన చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

First published: April 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...