ఇంటర్ వివాదం: ఫలితాలపై నేడు హైకోర్టులో విచారణ.. మధ్యాహ్నం రీవాల్యుయేషన్ రిజల్ట్స్?

TS Inter Results: ఈ రోజు హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఇంటర్‌ ఫలితాలపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఇప్పటికే హైకోర్టు ఇంటర్‌ బోర్డును ఆదేశించింది. దీంతో ఫలితాల వివరాలను అధికారులు హైకోర్టుకు అందించనున్నారు.

news18-telugu
Updated: May 15, 2019, 9:57 AM IST
ఇంటర్ వివాదం: ఫలితాలపై నేడు హైకోర్టులో విచారణ.. మధ్యాహ్నం రీవాల్యుయేషన్ రిజల్ట్స్?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ ఇంటర్ ఫలితాల వివాదం రాష్ట్రంలో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఇంటర్ బోర్డు తీరుపై విద్యార్థి లోకం భగ్గుమంది. తల్లిదండ్రులు, రాజకీయ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్, టీజేఎస్, బీజేపీతో పాటు విద్యార్థి సంఘాలు ఇంటర్ బోర్డు కార్యాలయం, విద్యాశాఖమంత్రి నివాసంతో పాటు ప్రగతి భవన్ ఎదుట ధర్నాలు చేశాయి. అయితే, సీఎం కేసీఆర్ కలగజేసుకొని వివాదాన్ని చల్లార్చే ప్రయత్నం చేశారు. ఫెయిల్ అయిన విద్యార్థుల రీవెరిఫికేషన్ ఉచితంగా చేస్తామని ప్రకటించారు. దీంతో వివాదం కాస్త సద్దుమణిగింది. అయితే, ఫలితాల వివాదంపై హైకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, ఫలితాల వివాదంపై ఈ రోజు హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఫలితాలపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఇప్పటికే హైకోర్టు ఇంటర్‌ బోర్డును ఆదేశించింది. దీంతో ఫలితాల వివరాలను అధికారులు హైకోర్టుకు అందించనున్నారు.

ఇదిలా ఉండగా, కోర్టు విచారణ అనంతరం రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ ఫలితాలను మధ్యాహ్నం వరకు ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసే అవకాశం ఉంది. కాగా, ఇంటర్ బోర్డు నుంచి గ్లోబరీనాను తొలగించిన సంగతి తెలిసిందే. 2018-19 నుంచి మూడేళ్ల పాటు పరీక్ష ఫలితాల నిర్వహణ బాధ్యతలను ఇంటర్‌ బోర్డు గ్లోబరీనాకు మొత్తం రూ.4.80 కోట్లతో బాధ్యతలను అప్పగించింది. అయితే మొదటి ఏడాదే పరీక్ష నిర్వహణలో గ్లోబరీనా పూర్తిగా విఫలమైంది. అనేక సాంకేతిక తప్పిదాలు జరిగినట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ నిర్ధారించింది. ఈ తప్పులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ ప్రతిపక్షాలు, ప్రజాపక్షాలు, విద్యార్థి సంఘాలు ముప్పేట దాడి చేశాయి. ఈ నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని గ్లోబరీనాపై వేటు వేసింది.
First published: May 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading