ఇంటర్ బోర్డులో ‘తప్పుల’కు కారణం చెప్పిన మంత్రి.. విచారణకు త్రిసభ్య కమిటీ

ఇంటర్ పరీక్షల ఫలితాల సందర్భంగా ఏర్పడిన అపోహలను తొలగించడానికి గాను టీఎస్‌టీఎస్‌ ఎండీ వెంకటేశ్వరరావు అధ్వర్యంలో కమిటీ వేస్తున్నట్టు చెప్పారు. మూడు రోజుల్లో నివేదికను సమర్పించాలని అధికారులను అదేశించామన్నారు.

news18-telugu
Updated: April 21, 2019, 9:53 PM IST
ఇంటర్ బోర్డులో ‘తప్పుల’కు కారణం చెప్పిన మంత్రి.. విచారణకు త్రిసభ్య కమిటీ
ఇంటర్ బోర్డు ఎదుట విద్యార్థుల ఆందోళన
news18-telugu
Updated: April 21, 2019, 9:53 PM IST
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల విషయంలో చోటుచేసుకున్న గందరగోళంపై రాష్ట్ర విద్యాశాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి తో పాటు ఇతర ఉన్నత అధికారులతో సమీక్షించారు. ఫలితాల విషయంలో తల్లితండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు. కొంతమంది అధికారుల అంతర్గత తగదాలతో ఈ అపోహలు సృష్టించబడినట్టు తమ దృష్టికి వచ్చిందని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. అయితే అదే సమయంలో ఫలితాల విషయంలో చోటుచేసుకున్న అపోహలను తొలగించడానికి గాను టీఎస్‌టీఎస్‌ ఎండీ వెంకటేశ్వరరావు అధ్వర్యంలో కమిటీ వేస్తున్నట్టు చెప్పారు. మూడు రోజుల్లో నివేదికను సమర్పించాలని అధికారులను అదేశించామన్నారు. ఈ కమిటీలో వెంకటేశ్వర్ రావు తో పాటు హైదరాబాద్ బిట్స్ కు చెందిన ప్రొఫెసర్ వాసన్, ఐఐటీ హైదరాబాద్ కు చెందిన ప్రొఫెసర్ నిశాంత్ లు సభ్యులుగా ఉంటారని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.

ఫలితాల విషయంలో పొరపాట్లు జరిగినట్లు భావిస్తే కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ లకు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. ఎలాంటి పొరపాటు జరిగినా తాము సరిదిద్దుతామని హామీ ఇచ్చారు. కొంతమంది అధికారుల అంతర్గత తగాదాలవల్లే ఈ అపోహలు సృష్టించబడ్డాయని, ఏ ఒక్క విద్యార్థిని నష్టపోనివ్వమని స్పష్టం చేశారు.

First published: April 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...