TS INTER RESULTS 2022 TSBIE RELEASED INTER FIRST YEAR AND INTER SECOND YEAR RESULTS CHECK HERE FOR DIRECT LINKS SS
TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి... ఈ వెబ్‌సైట్స్‌లో చెక్ చేయండి
TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి... ఈ వెబ్‌సైట్స్‌లో చెక్ చేయండి
(ప్రతీకాత్మక చిత్రం)
TS Inter Results 2022 | తెలంగాణ ఇంటర్ బోర్డు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ (Telangana Inter Results) విడుదల చేసింది. ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు (TS Intermediate Results 2022) విడుదలయ్యాయి. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండియర్ ఫలితాలను విడుదల చేసింది. ఇంటర్ బోర్డు కార్యాలయంలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు ఇంటర్ రిజల్ట్స్‌ని మూడు ప్రభుత్వ వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు. వీటితో పాటు న్యూస్18 తెలుగు వెబ్‌సైట్ https://telugu.news18.com/ లో కూడా ఇంటర్ రిజల్ట్స్ చెక్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.
న్యూస్18 తెలుగు వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేయండిలా
తెలంగాణలో మే 26 నుంచి మే 24 వరకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు జరిగాయి. 4.64 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్, 4.39 మంది విద్యార్థులు ఇంటర్ సెకండియర్ పరీక్షల్ని రాశారు. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కారణంగా 70 శాతం సిలబస్‌తోనే ఇంటర్ పరీక్షల్ని నిర్వహించారు అధికారులు. ఇంటర్ ఫలితాల విడుదల తేదీపై రకరకాల ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. మొదట జూన్ 15న ఫలితాలు వస్తాయన్నారు. ఆ తర్వాత జూన్ 25న రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందన్న వార్తలొచ్చాయి. అయితే మూల్యాంకనం పూర్తైన తర్వాత కంప్యూటరీకరణ విషయంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా ఇంటర్ బోర్డు అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.