TS INTER RESULTS 2022 TELANGANA INTER BOARD TO RELEASE INTERMEDIATE ONLINE MEMORANDUM OF MARKS OR SHORT MEMOS ON WEBSITE TODAY KNOW HOW TO DOWNLOAD SS
TS Inter Marks Memos 2022: నేటి నుంచే ఇంటర్ మార్క్స్ మెమోల జారీ... ఇలా డౌన్‌లోడ్ చేయాలి
TS Inter Marks Memos 2022: నేటి నుంచే ఇంటర్ మార్క్స్ మెమోల జారీ... ఇలా డౌన్‌లోడ్ చేయాలి
(ప్రతీకాత్మక చిత్రం)
TS Inter Marks Memos 2022 | తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేసిన తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) షార్ట్ మెమోలను అందుబాటులోకి తీసుకురానుంది.
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ఇంటర్ ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలు చెక్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఫలితాలతో పాటు ఆన్‌లైన్‌లో మార్క్స్ మెమోలను జారీ చేస్తోంది. కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో పాటు విద్యార్థులు మార్క్స్ మెమోలు డౌన్‌లోడ్ చేయొచ్చు. 2022 జూన్ 28 సాయంత్రం 5 గంటల నుంచి షార్ట్ మెమో (TS Inter Short Memo) డౌన్‌లోడ్ చేయొచ్చు. తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in/ లో షార్ట్ మెమోలు అందుబాటులో ఉంటాయి. ఎలా డౌన్‌లోడ్ చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
విద్యార్థులు ఈ మార్క్స్ మెమోను కలర్ కాపీ ప్రింట్ తీసుకోవచ్చు. ప్రిన్సిపాల్స్ తమ కళాశాల విద్యార్థుల మార్క్స్ మెమోలను కాలేజ్ లాగిన్‌తో డౌన్‌లోడ్ చేయొచ్చు. కళాశాలలకు కాలేజ్ మార్క్స్ రిజిస్టర్స్ 2022 జూలై 5 నుంచి అందుబాటులో ఉంటాయి. మార్క్స్ మెమో ఫిజికల్ కాపీని వేరుగా ఇవ్వట్లేదని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు ఇంటర్ బోర్డు తెలియజేసింది.
మార్క్స్ మెమోల్లో ఏవైనా తప్పులు, తేడాలు ఉంటే సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్స్ దృష్టికి తీసుకెళ్లాలి. లేదా ఫలితాలు వెల్లడైన 10 రోజుల్లో ఇంటర్ బోర్డ్ హెల్ప్ డెస్క్ ఇమెయిల్ ఐడీ helpdesk-ie-telangana.gov.in కి మెయిల్ చేయాలి. ఆ తర్వాత వచ్చే దరఖాస్తుల్ని పరిగణలోకి తీసుకోరు.
రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ చేయించాలనుకునే విద్యార్థులు 2022 జూన్ 30 నుంచి 2022 జూలై 6 వరకు దరఖాస్తు చేయాలి. దరఖాస్తు తేదీ పొడిగించే అవకాశం లేదు. రీకౌంటింగ్ కోసం ఒక పేపర్‌కు రూ.100, ఆన్సర్ బుక్ స్కాన్డ్ కాపీ కమ్ రీవెరిఫికేషన్ కోసం రూ.600 ఫీజు చెల్లించాలి. https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ కోసం అప్లై చేయాలి. మ్యాన్యువల్‌గా దరఖాస్తు చేసే అవకాశం ఉండదు.
ఇక విద్యార్థులకు ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 10 వరకు రెండు సెషన్స్‌లో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి. విద్యార్థులు 2022 జూన్ 30 నుంచి జూలై 6 వరకు తమ కళాశాలల్లో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.