హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS Inter Results 2022: ఇంటర్ పరీక్షల్లో మార్కులు తక్కువగా వస్తే ఇలా చేయండి

TS Inter Results 2022: ఇంటర్ పరీక్షల్లో మార్కులు తక్కువగా వస్తే ఇలా చేయండి

TS Inter Results 2022: ఇంటర్ పరీక్షల్లో మార్కులు తక్కువగా వస్తే ఇలా చేయండి
(ప్రతీకాత్మక చిత్రం)

TS Inter Results 2022: ఇంటర్ పరీక్షల్లో మార్కులు తక్కువగా వస్తే ఇలా చేయండి (ప్రతీకాత్మక చిత్రం)

TS Inter Results 2022 | తెలంగాణ ఇంటర్ బోర్డు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ (Telangana Inter Results) విడుదల చేసింది. ఇంటర్ పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చినవారికి మూడు ఆప్షన్స్ ఉన్నాయి.

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు (TS Intermediate Results 2022) విడుదలయ్యాయి. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌తో పాటు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ తేదీలను కూడా ప్రకటించింది. పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చినవారు, ఫెయిల్ అయిన విద్యార్థులు ఈ ఆప్షన్స్ ఉపయోగించుకోవచ్చు. ఆగస్ట్ 1 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు జూన్ 30 నుంచి సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించవచ్చు. ఇక ఇంటర్ విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేయొచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ జూన్ 30న ప్రారంభం కానుంది.

రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ చేయించాలనుకునే విద్యార్థులు 2022 జూన్ 30 నుంచి 2022 జూలై 6 వరకు దరఖాస్తు చేయాలి. దరఖాస్తు తేదీ పొడిగించే అవకాశం లేదు. రీకౌంటింగ్ కోసం ఒక పేపర్‌కు రూ.100, ఆన్సర్ బుక్ స్కాన్డ్ కాపీ కమ్ రీవెరిఫికేషన్ కోసం రూ.600 ఫీజు చెల్లించాలి. https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ కోసం అప్లై చేయాలి. మ్యాన్యువల్‌గా దరఖాస్తు చేసే అవకాశం ఉండదు.

ఇక విద్యార్థులకు ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 10 వరకు రెండు సెషన్స్‌లో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి. విద్యార్థులు 2022 జూన్ 30 నుంచి జూలై 6 వరకు తమ కళాశాలల్లో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించాలి.


తెలంగాణ ఇంటర్ ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండ్ ఇయర్‌లో 67.82 శాతం మంది విద్యార్థులు పాస్ అయినట్టు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఫస్ట్ ఇయర్‌లో జనరల్, వొకేషనల్ కలిపి మొత్తం 4,64,892 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే వారిలో 1,93,925 మంది విద్యార్థులు 75 శాతం కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకొని ఏ గ్రేడ్ సంపాదించారు. 60 శాతం నుంచి 75 శాతం మార్కులతో 63,501 మంది విద్యార్థులు బీ గ్రేడ్, 50 శాతం నుంచి 60 శాతం మార్కులతో 24,747 మంది విద్యార్థులు సీ గ్రేడ్, 35 శాతం నుంచి 50 శాతం మార్కులతో 12,205 మంది విద్యార్థులు డీ గ్రేడ్ సంపాదించారు. మొత్తం 2,94,378 మంది విద్యార్థులు పాస్ అయ్యారు.

ఇక సెకండ్ ఇయర్‌లో జనరల్, వొకేషనల్ కలిపి మొత్తం 4,42,895 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే వారిలో 1,59,432 మంది విద్యార్థులు 75 శాతం కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకొని ఏ గ్రేడ్ సంపాదించారు. 60 శాతం నుంచి 75 శాతం మార్కులతో 82,501 మంది విద్యార్థులు బీ గ్రేడ్, 50 శాతం నుంచి 60 శాతం మార్కులతో 35,829 మంది విద్యార్థులు సీ గ్రేడ్, 35 శాతం నుంచి 50 శాతం మార్కులతో 18,243 మంది విద్యార్థులు డీ గ్రేడ్ సంపాదించారు. మొత్తం 2,97,458 మంది విద్యార్థులు పాస్ అయ్యారు.

ఇక జిల్లాల వారీగా చూస్తే ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 76 శాతం పాస్ పర్సెంటేజీతో మేడ్చల్ మొదటి స్థానంలో, 74 శాతంతో హన్మకొండ రెండో స్థానంలో, 72 శాతంతో కొమరం భీమ్ ఆసిఫాబాద్, రంగారెడ్డి జిల్లాలు మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నాయి. సెకండ్ ఇయర్ ఫలితాల్లో 78 శాతం పాస్ పర్సెంటేజీతో మేడ్చల్ మొదటి స్థానంలో, 77 శాతంతో హన్మకొండ, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో మెదక్ జిల్లా చివరి స్థానంలో ఉంది.

First published:

Tags: JOBS, Telangana Inter Results, Telangana intermediate results, TS Inter Exams 2022, TS Inter Results 2022

ఉత్తమ కథలు