తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్‌ని విడుదల చేసింది. 2021 అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 మధ్య ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయా అని విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూశారు. ఆ ఉత్కంఠకు తెరదించుతూ ఇంటర్ బోర్డు ఫలితాలను విడుదల చేసింది. జనరల్, వొకేషనల్ కోర్సుల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు ఇంటర్ బోర్డుతో పాటు ఇతర ప్రభుత్వ వెబ్సైట్లలో ఫలితాలు చెక్ చేయొచ్చు. ఫలితాలను ఈ కింది వెబ్సైట్లలో చెక్ చేయండి.
ఇంటర్ విద్యార్థులు మార్క్స్ మెమోను 2021 డిసెంబర్ 17 సాయంత్రం 5 గంటల నుంచి డౌన్లోడ్ చేయొచ్చు. పైన వెల్లడించిన వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ మార్క్స్ మెమో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెమోపై విద్యార్థుల ఫోటో, సంతకం ఉంటాయి. జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ బోర్డు ఇచ్చిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో https://tsbie.cgg.gov.in వెబ్సైట్లో మెమోలు డౌన్లోడ్ చేయొచ్చు.
తెలంగాణ ఇంటర్ బోర్డు జారీ చేసిన ఫలితాల్లో తప్పులు ఉంటే సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్స్ ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేయొచ్చు. విద్యార్థులు తమకు వచ్చిన ఫలితాల్లో సందేహాలు ఉంటే తమ కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లాలి. ఇక ఫలితాలతో ఒత్తిడి, ఆందోళనకు గురయ్యే విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేసింది. క్లినికల్ సైకాలజిస్టుల సేవల్ని ఉపయోగించుకుంటోంది. కింద వెల్లడించిన క్లినికల్ సైకాలజిస్టులకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య విద్యార్థులు ఫోన్ చేసి కౌన్సిలింగ్ తీసుకోవచ్చు.
Dr. Anitha- 9154951704
Dr. Mazher Ali- 9154951977
Dr. Rajini- 9154951695
P. Jawaharlal Nehru- 9154951699
S. Sreelatha- 9154951703
Sailaja Pisapati- 9154951706
Anupama Guttimdevi- 9154951687
ఇక తమకు మార్కులు సరిగ్గా రాలేదని విద్యార్థులు భావిస్తే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేయొచ్చు. ఆన్లైన్లో తమ సమాధానాల పత్రాలు పొందొచ్చు. ఇందుకోసం విద్యార్థులు ఒక పేపర్‌కు రీకౌంటింగ్ కోసం రూ.100, రీవెరిఫికేషన్, ఆన్సర్ బుక్ స్కాన్డ్ కాపీ కోసం రూ.600 ఫీజు చెల్లించాలి. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేయడానికి 2021 డిసెంబర్ 22 చివరి తేదీ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Intermediate, Intermediate exams, Telangana Inter Results, Telangana intermediate results