హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Inter Exams: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్... ఫెయిల్ అయినవారికి పరీక్షలు ఎప్పుడంటే

Inter Exams: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్... ఫెయిల్ అయినవారికి పరీక్షలు ఎప్పుడంటే

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

TS Inter Exams | తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్. ఫెయిల్ అయిన విద్యార్థులకు పరీక్షలు (Inter Exams) ఎప్పుడు ఉంటాయో క్లారిటీ ఇచ్చింది తెలంగాణ ఇంటర్ బోర్డ్.

తెలంగాణ ఇంటర్ బోర్డ్ రెండు రోజుల క్రితం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫలితాలను (TS Inter Results 2021) విడుదల చేసిన సంగతి తెలిసిందే. పరీక్షలో హాజరైనవారిలో దాదాపు సగం మంది ఫెయిల్ అయ్యారు. దీంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. సాధారణంగా పరీక్షల్లో ఫెయిల్ అయినవారికి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఫెయిల్ అయినవారు, ఇంప్రూవ్‌మెంట్ రాయాలనుకునేవారు సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేస్తూ ఉంటారు. అయితే ఈసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ పరీక్షలే 2021 అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 మధ్య జరిగాయి. మరో నాలుగు నెలల్లో యాన్యువల్ ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఫెయిల్ అయినవారికి సప్లిమెంటరీ పరీక్షల్ని నిర్వహించట్లేదు ఉంటర్ బోర్డు.

ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌లో ఫెయిల్ అయినవారు, ఇంప్రూవ్‌మెంట్ రాయాలనుకునేవారు 2022 ఏప్రిల్‌లో జరిగే వార్షిక పరీక్షలకు హాజరు కావొచ్చని తెలంగాణ ఇంటర్ బోర్డ్ సెక్రెటరీ సయ్యద్ ఒమర్ జలీల్ అధికారికంగా ప్రకటించారు. ఇంటర్ ఫలితాలపై తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని జలీల్ తెలిపారు. 70 శాతం సిలబస్ తగ్గించడంతో పాటు, ప్రశ్నల్లో ఛాయిస్ పెంచి ఈ ఎగ్జామ్స్ నిర్వహించామని క్లారిటీ ఇచ్చారు. ఫలితాలపై అనుమానాలు ఉన్నవారు రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేయొచ్చన్నారు.

SSC 2022 Exam Calendar: నిరుద్యోగులకు అలర్ట్... ఎస్ఎస్‌సీ ఎగ్జామ్ క్యాలెండర్ విడుదల

ఇప్పుడు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉండవు కాబట్టి విద్యార్థులు ఇంటర్మీడియట్ సెకండియర్ ఎగ్జామ్స్‌తో పాటు ఫస్ట్ ఇయర్ బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. తమకు వచ్చిన మార్కులపై అనుమానాలు ఉన్న విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌ చేయించొచ్చు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు ఒక పేపర్‌కు రీకౌంటింగ్ కోసం రూ.100, రీవెరిఫికేషన్, ఆన్సర్ బుక్ స్కాన్డ్ కాపీ కోసం రూ.600 ఫీజు చెల్లించాలి. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేయడానికి 2021 డిసెంబర్ 22 చివరి తేదీ.

తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో కేవలం 49 శాతం మంది మాత్రమే పాస్ కావడం చర్చనీయాంశమవుతోంది. ఇంత తక్కువ పాస్ పర్సెంటేజీ ఎప్పడూ ఉండదు. జనరల్ విభాగంలో మొత్తం 4,09,991 మంది హాజరైతే, 1,99,756 మంది పాస్ అయ్యారు. ఒకేషనల్ విభాగంలో 49, 331 మంది పరీక్షకు హాజరైతే కేవలం 24,226 మంది మాత్రమే పాస్ అయ్యారు. జనరల్ లో 49 శాతం, ఒకేషనల్ లో కూడా 49 శాతం మాత్రమే పాస్ అయ్యారు.

SBI Recruitment 2021: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1,226 జాబ్స్... ఏం చదవాలంటే

ఇక ఇంటర్ బోర్డ్ వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in లో మార్క్స్ మెమోస్‌ను అప్‌లోడ్ చేసింది అప్‌లోడ్ చేసింది తెలంగాణ ఇంటర్ బోర్డ్. విద్యార్థులు https://tsbie.cgg.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత TSBIE IPE 2021 Mark's Memos సెక్షన్‌లో ఫస్ట్ ఇయర్ జనరల్, ఫస్ట్ ఇయర్ వొకేషనల్, జనరల్ బ్రిడ్జి కోర్స్, వొకేషనల్ బ్రిడ్జి కోర్స్ మార్క్స్ మెమోస్‌కు వేర్వేరు లింక్స్ ఉంటాయి. విద్యార్థులు తమకు సంబంధించిన లింక్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి Get Memo పైన క్లిక్ చేయాలి. Print పైన క్లిక్ చేసి తమకు కావాల్సిన ఫార్మాట్‌లో మార్క్స్ మెమోను డౌన్‌లోడ్ చేయొచ్చు.

First published:

Tags: Career and Courses, Intermediate, Intermediate exams, Telangana inter board, Telangana Inter Results, Telangana intermediate results

ఉత్తమ కథలు