TS Inter Results 2020: ఈ వెబ్‌సైట్లలో ఇంటర్ ఫలితాలు... సాంకేతిక సమస్యలు లేకుండా ఏర్పాట్లు

TS Inter Results 2020 | తెలంగాణ ఇంటర్ ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఏ వెబ్‌సైట్లలో ఫలితాలు విడుదల కానున్నాయో తెలుసుకోండి.

news18-telugu
Updated: June 18, 2020, 1:39 PM IST
TS Inter Results 2020: ఈ వెబ్‌సైట్లలో ఇంటర్ ఫలితాలు... సాంకేతిక సమస్యలు లేకుండా ఏర్పాట్లు
TS Inter Results 2020: ఈ వెబ్‌సైట్లలో ఇంటర్ ఫలితాలు... సాంకేతిక సమస్యలు లేకుండా ఏర్పాట్లు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్టు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్-TSBIE ఇప్పటికే ప్రకటించింది. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చేతుల మీదుగా ఫలితాల విడుదల కార్యక్రమం ప్రారంభం కానుంది. 3.00 నుంచి 3.20 వరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రెటరీ తదితరులు మాట్లాడతారు. 3.20 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు. తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ https://tsbie.cgg.gov.in/ తో పాటు http://results.cgg.gov.in, http://examresults.ts.nic.in వెబ్‌సైట్లలో విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.


ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాల విడుదలలో సాంకేతిక సమస్యలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఫలితాలు విడుదల చేసిన కాసేపటివరకు విద్యార్థులు తమ రిజల్ట్స్ చూసుకోలేకపోయారు. సర్వర్లు మొరాయించడంతో సాంకేతిక సమస్యలు వచ్చాయి. ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయడంతో వెబ్‌సైట్లపై లోడ్ పెరిగింది. సర్వర్లు మొరాయించాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. తెలంగాణ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్-CGG లో 7 సర్వర్లు ఉన్నట్టు తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు ప్రకటించారు. ప్రతీ సర్వర్ 800 ఎంబీపీఎస్ స్పీడ్ బ్యాండ్ విడ్త్‌తో ఉండటంతో సాంకేతిక సమస్యలు తలెత్తవని భావిస్తున్నారు. విద్యార్థులు ప్రభుత్వ వెబ్‌సైట్లతో పాటు https://telugu.news18.com/ వెబ్‌సైట్‌లో కూడా ఇంటర్ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

TS Inter Results 2020: మొబైల్ యాప్‌లో ఇంటర్ ఫలితాలు... ఇలా చెక్ చేయండి

Career Guidance: ఇంటర్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు... చేయొచ్చు ఇలా

Courses After Inter: ఇంటర్ తర్వాత ఈ కోర్సులు చేయొచ్చు

Courses after Inter: ఇంటర్ తర్వాత ఈ 123 కోర్సులు చేయొచ్చు... విద్యార్థులకు సీబీఎస్ఈ సలహా
Published by: Santhosh Kumar S
First published: June 18, 2020, 1:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading