TS INTER RESULTS 2020 LIVE UPDATES TSBIE BEGINS RECOUNTING AND SCANNED COPY CUM REVERIFICATION PROCESS KNOW HOW TO APPLY SS
TS Inter Results 2020: ఇంటర్ ఫలితాల్లో మార్కులు తక్కువొచ్చాయా? రీకౌంటింగ్ ప్రాసెస్ ఇదే...
TS Inter Results 2020: ఇంటర్ ఫలితాల్లో మార్కులు తక్కువొచ్చాయా? రీకౌంటింగ్ ప్రాసెస్ ఇదే...
(ప్రతీకాత్మక చిత్రం)
TS Inter Results 2020 Live updates | ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రక్రియను ప్రకటించింది తెలంగాణ ఇంటర్ బోర్డు. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో మార్కులు తక్కువగా వచ్చాయా? తక్కువ మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యారా? మరోసారి మీ ఆన్సర్ బుక్లెట్ రీకౌంటింగ్ చేయించాలనుకుంటున్నారా? తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్-TSBIE రీకౌంటింగ్ వివరాలను వెల్లడించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేయొచ్చు. అంతేకాదు. మీ ఆన్సర్ షీట్ స్కాన్డ్ కాపీని కూడా పొందొచ్చు. రీవెరిఫికేషన్ చేయించొచ్చు. ఇందుకోసం విద్యార్థులు ఆన్లైన్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రీకౌంటింగ్ అయితే ఒక పేపర్‌కు రూ.100 చొప్పున, ఆన్సర్ బుక్లెట్ స్కాన్డ్ కాపీ కమ్ రీవెరిఫికేషన్‌కు రూ.600 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. https://tsbie.cgg.gov.in/ వెబ్సైట్లో స్టూడెంట్ ఆన్లైన్ సర్వీసెస్‌లో రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేయొచ్చు.
విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేయించాలనుకునే సబ్జెక్ట్‌ను వెల్లడించాలి. పూర్తి అడ్రస్, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ తెలపాలి. మీ దరఖాస్తును ప్రిన్సిపాల్ ద్వారా లేదా జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేన్ ఆఫీసర్ కార్యాలయం ద్వారా లేదా వ్యక్తిగతంగా లేదా డీడీ తీసి పోస్టు ద్వారా పంపొచ్చు. విద్యార్థులు తమ జవాబు పత్రాలకు మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇతర విద్యార్థుల జవాబు పత్రాల కోసం దరఖాస్తు చేయడం నేరం. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేయడానికి 2020 జూన్ 24 చివరి తేదీ. ఆ తర్వాత రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రక్రియ నిలిపివేస్తుంది ఇంటర్ బోర్డు. చివరి తేదీ పొడిగింపు కూడా ఉండదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.